హైదరాబాద్‌సిటీ, వెలుగు: కొండాపూర్ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కొత్తగా పుష్పక్సర్వీస్ప్రవేశపెడుతున్నట్లు గ్రేటర్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. లింగంపల్లి నుంచి కొండాపూర్మీదుగా ఈ సర్వీస్నడుస్తుందని చెప్పారు. బీహెచ్ఎల్టౌన్షిప్, ఆల్విన్‌క్రాస్‌రోడ్స్, హఫీజ్ పేట, కొండాపూర్, కొత్తగూడ, గచ్చిబౌలి ప్రాంతాలవారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
టికెట్ధరను రూ.300గా నిర్ణయించామన్నారు. ప్రతిరోజు ఉదయం 5.45 గంటలకు లింగంపల్లి నుంచి మొదటి బస్సు బయలుదేరుతుందని, చివరిగా రాత్రి 8.45గంటలకు ఉంటుందని తెలిపారు. అలాగే ఎయిర్‌పోర్టు నుంచి లింగంపల్లికి ఉదయం 7.30 నుంచి ఫస్ట్బస్సు బయలుదేరుతుందని, చివరిగా రాత్రి10.30 గంటలకు ఉంటుందన్నారు.
గ్రూప్-2 అభ్యర్థులకు స్పెషల్ బస్సులు
ఈ నెల15, 16 తేదీల్లో జరగనున్న గ్రూప్–2 ఎగ్జామ్స్ కు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు గ్రేటర్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్వినోద్కుమార్తెలిపారు. సిటీలోని అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంటాయని, అధికారులు వివిధ బస్స్టేషన్ల వద్ద మానిటర్చేస్తారని చెప్పారు.
కోఠి, రేతిఫైల్బస్స్టేషన్లలో కమ్యూనికేషన్సెంటర్లు ఉంటాయని, సమాచారం కోసం కోఠి బస్‌స్టేషన్(99592 26160), రేతి ఫైల్బస్స్టేషన్(99592 26154) నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు.