
మాస్కో: ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపై తమ బలగాలు బాంబు దాడులు చేయడం లేదని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమర్ పుతిన్ అన్నారు. రష్యా బాంబు దాడులకు పాల్పడుతోందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని చెప్పారు. తనతో జరిపిన ఫోన్ సంభాషణలో పుతిన్ ఈ విషయం చెప్పినట్లు జర్మన్ ఛాన్స్లర్ ఒలాఫ్ స్కోల్జ్ ప్రకటించారు. కీవ్తో పాటు ఇతర పెద్ద నగరాలపై మిసైల్ దాడుల చేస్తున్నారని అబద్ధపు ప్రచారం జరుగుతోందని పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధమని, అయితే రష్యా షరతులను ఉక్రెయిన్ అంగీకరిస్తేనే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.