
మాస్కో: రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అజర్ బైజాన్ అధ్యక్షుడికి క్షమాపణలు చెప్పారు. అజర్ బైజాన్ విమాన ప్రమాదానికి కారణమైనందుకు విచారం వ్యక్తం చేశారు. ఇటీవల అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం కూలిపోయి 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమానం అజర్ బైజాన్‌లోని బాకు నుంచి రష్యాలోని చెచెన్యా ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 38 మంది మృతి చెందగా, 29 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన రోజున ఉక్రెయిన్ డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు గ్రోజ్ని సమీపంలో రష్యా డిఫెన్స్ సిస్టమ్స్‌ను ప్రయోగిస్తోందని క్రెమ్లిన్ అధికార ప్రకటనలో పేర్కొంది.