
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ భారత పర్యటనకు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు పుతిన్ భారత్‌లో పర్యటిస్తారని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ వెల్లడించారు. 2022లో ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. కాగా, పుతిన్ భారత పర్యటనపై సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ భారత ప్రధానిగా మూడోసారి తిరిగి ఎన్నికైన తర్వాత తొలుత రష్యాలో పర్యటించారు.
కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనడంతో పాటు.. పుతిన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పుతిన్‌ను భారత్‌లో పర్యటించాలని అప్పుడు మోడీ కోరారు. ప్రధాని మోడీ ఆహ్వానాన్ని అంగీకరించిన పుతిన్.. త్వరలో భారతదేశాన్ని సందర్శిస్తారు’ అని పేర్కొన్నారు. పుతిన్ భారత పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయని.. ఇంకా పూర్తి షెడ్యూల్ ఖరారు కాలేదని తెలిపారు. మోడీ అప్పుడు రష్యాలో పర్యటించగా.. ఇప్పుడు భారత్‌లో పర్యటించడం పుతిన్ వంతు అని అన్నారు.
Also Read : త్వరలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చనిపోతాడు
కాగా, ప్రధాని మోడీ 2024, జూలైలో రష్యాలో పర్యటించిన విషయం తెలిసిందే. భారత ప్రధానిగా మూడోసారి పగ్గాలు చేపట్టిన వెంటనే రష్యాలో పర్యటించిన మోడీ.. కజాన్‌లో జరిగిన బ్రిక్స్ ఆర్ధిక సదస్సులో పాల్గొన్నారు. అలాగే.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యి.. భారత్, రష్యా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ పర్యటన సందర్భంగానే పుతిన్‌ను భారత్‌లో పర్యటించాలని కోరారు.
తాజాగా ప్రధాని మోడీ ఇన్విటేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పుతిన్.. త్వరలో భారత్‌లో పర్యటించబోతున్నాడు. దాదాపు మూడేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. వార్ పీక్ స్టేజ్‌లో ఉన్న వేళ పుతిన్ భారత పర్యటనకు రావాలనుకోవడం ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మొదటి నుంచి ఇండియా న్యూట్రల్ విధానం అవలభిస్తోంది. అటు రష్యాకు గానీ.. ఇటు ఉక్రెయిన్‌కు గానీ మద్దతు తెలపలేదు.