టాటా గుడ్ బై: కిమ్ కు వీడుకోలు పలికిన పుతిన్.. వీడియో వైరల్..

ఒకరేమో రష్యా అధ్యక్షుడు, ఇంకొకరేమో ఉత్తర కొరియా అధ్యక్షుడు.ఇద్దరు తమ వ్యక్తిత్వాలు, నియంతృత్వ ధోరణితో తమ ప్రత్యేకత చాటుకున్నారు. రష్యా అధ్యక్షుడు వాల్డ్ మీర్ పుతిన్ మాట అటుంచితే, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మాత్రం సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఈ ఇద్దరు ఒక చోట కలిస్తే ఇక సోషల్ మీడియాకు కావాల్సినంత స్టఫ్ వస్తుంది.పుతిన్ ఉత్తర కొరియా పర్యటన నేపథ్యంలో ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి.

పుతిన్, కిమ్ కలిసి ఒకే కార్లో వెళ్లిన వీడియో వైరల్ కాగా, తాజాగా ఉత్తర కొరియా పర్యటన ముగించుకున్న సందర్భంలో పుతిన్ కిమ్ కి వీడుకోలు చెబుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఫ్లైట్ లో నుండి పుతిన్ టాటా చెబుతుండగా, కింద నుండి కిమ్ కూడా చేయి ఊపుతూ ఉన్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది.