పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి : పుట్ట ఆంజనేయులు

 పంచాయతీ కార్మికుల  సమస్యలను పరిష్కరించాలి : పుట్ట ఆంజనేయులు

వనపర్తి , వెలుగు: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, మండ్ల రాజు, పుట్ట ఆంజనేయులు డిమాండ్​ చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు హనుమంతు నాయక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో లీడర్లు మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవలు అందించిన గ్రామపంచాయతీ సిబ్బందికి న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. కార్మికులను పర్మినెంట్​ చేయాలని, కారోబార్. బిల్ కలెక్టర్లు, గుమస్తాలను సహాయ కార్యదర్శులుగా నియమిస్తామనే హామీల అమలు చేయాలని కోరారు. గ్రామపంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానం రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాములు, పుష్పలత, దాసు, చంద్రశేఖర్, యాదగిరి, ఎల్లయ్య, శ్రీనివాసులు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు