ప్రభుత్వానికి ‘అగ్ని’ పరీక్షలు

ప్రభుత్వానికి ‘అగ్ని’ పరీక్షలు

రాష్ట్రంలో అకడమిక్​, ఎంట్రన్స్​, పబ్లిక్​ ఎగ్జామ్స్​ పెట్టడం ప్రభుత్వానికి అగ్నిపరీక్షలా మారింది. ఓవైపు ఇంటర్​ ఎగ్జామ్స్​ పూర్తయి పేపర్లు దిద్దే పని కూడా మొదలు కాగా, ఇప్పటికే ఆరంభమైన టెన్త్​ పరీక్షలు హైకోర్టు ఆదేశాలతో సోమవారం నుంచి వాయిదా పడ్డాయి. మార్చి 30 తర్వాత హైలెవెల్​ మీటింగ్​లో పరిస్థితి సమీక్షించి రీ షెడ్యూల్​ చేస్తారు. ఇంటర్​ ఎగ్జామ్స్​కి దాదాపు 10 లక్షల మంది స్టూడెంట్స్​ హాజరయ్యారు. వ్యాల్యుయే షన్​కి లెక్చరర్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో వాళ్లపై కరోనా వైరస్​ ప్రభావం  పడే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2016 ఎంసెట్ పరీక్షలు, 2019 ఇంటర్ పరీక్షలు గవర్నమెంట్​ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఆ చేదు అనుభవాల దృష్ట్యా ఈ విద్యా సంవత్సరం పరీక్షల నిర్వహణను ప్రెస్టేజ్​గా తీసుకున్నారు. విద్యా శాఖ మంత్రితోపాటు ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పరీక్షల ఏర్పాట్లను సమీక్షించారు. కలెక్టర్ల సెల్ఫ్​ ఇన్​స్పెక్షన్​లో ఇంటర్ పరీక్షలు సక్సెస్​ఫుల్​గా పూర్తయ్యాయి. టెన్త్​ పరీక్షలకూ ఇదే స్ఫూర్తితో ఏర్పాట్లు చేసినా కరోనా వైరస్​వల్ల పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. సోమవారం (మార్చి23) నుంచి మార్చి 30వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

పరీక్షల్ని పక్కాగా నిర్వహించటం, కరెక్ట్​ రిజల్ట్స్​ ప్రకటించటం ద్వారానే విద్యా సంస్థలు, ప్రభుత్వం.. స్టూడెంట్స్​, పేరెంట్స్​ నమ్మకం పొందే ఛాన్స్​ ఉంది. ఎగ్జామ్స్​ రాసిన ప్రతి విద్యార్థికీ తన శక్తిసామర్థ్యాలకు అనుగుణంగానే ఫలితాలు వచ్చాయనే సంతృప్తిని కల్పించినప్పుడే పరీక్ష సంస్థల విశ్వసనీయత పెరుగుతుంది. పరీక్షల నిర్వహణలో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఇంటర్​ బోర్డు, జేఎన్టీయూహెచ్, టీఎస్​పీఎస్సీ లాంటి సంస్థలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విమర్శలపాలయ్యాయి.

గ్లోబరీనా ఎపిసోడ్​.. మాయని మచ్చ

అనుభవం, అర్హత లేని గ్లోబరీనా సంస్థకు ‘ఇంటర్మీయెట్​’ బాధ్యతలను అప్పగించడం, ఆ సంస్థ.. ఒప్పందం ప్రకారం ఇంటిగ్రేటెడ్​ ఐటీ ప్రోగ్రామ్​ని రూపొందించుకోలేకపోవడం వల్ల విద్యార్థుల సమాచార, ఫీజుల చెల్లింపు వివరాల సేకరణలో భారీగా పొరపాట్లు జరిగాయి. దీంతో పరీక్షల నిర్వహణ, పేపర్​ వ్యాల్యుయేషన్​ తదితర ప్రక్రియల్లో లోపాలు, ఫలితాల విశ్లేషణలో ఘోరమైన తప్పిదాలు చోటుచేసుకున్నాయి. పరీక్షలకు ముందే ఈ ప్రమాదాన్ని పసిగట్టినా బోర్డు ఆఫీసర్లు దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు.

దీనికి ప్రభుత్వ ఉదాసీనత తోడవటం మొదలైన కారణాలతో ఇంటర్ బోర్డు ప్రతిష్ఠ దిగజారింది. విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి ఏపీలో ప్రవేశ పరీక్షల నిర్వహణలో టాప్​లో నిలిచిన జేఎన్టీయూ 2016లో ఎంసెట్ నిర్వహణలో అబాసుపాలైంది. ఎంసెట్–-2 క్వశ్చన్​ పేపర్​  లీకైన ఉదంతంపై జరిగిన విచారణలో.. క్రిమినల్ రికార్డ్​ ఉన్న వ్యక్తులు, సంస్థల ప్రమేయంతోపాటు ప్రశ్నపత్రాల రూపకల్పనలో రూల్స్​ని జేఎన్టీయూ ఆఫీసర్లు గాలికొదిలేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

నలుగురిలో నానాయి

ఈ పరిణామాలతో ఎంసెట్ నిర్వహణను టీఎస్​పీఎస్సీకి ఇవ్వాలని, ఇంటర్ బోర్డును ఎస్సెస్సీ బోర్డులో విలీనం చేయాలని డిమాండ్లు వచ్చాయి. గ్రూప్-–2 పరీక్ష నిర్వహణలో పొరపాట్లు, లీగల్​ కేసులు, వెరసి ఫలితాల ప్రకటనలో జాప్యంతో సీఎం కేసీఆరే​ టీఎస్​పీఎస్పీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని పరీక్షల నిర్వహణ బాధ్యతలను వేరే సంస్థలకు ఇవ్వటం మొదలైంది. అందువల్ల పోటీ, ప్రవేశ, పబ్లిక్ పరీక్షల నిర్వహణలో బాధ్యతగా ఉండాలి.

ప్రతి దశలోనూ జాగ్రత్త

పరీక్షల నిర్వహణకు ఇంటర్​, సెకండరీ ఎడ్యుకేషన్​ బోర్డులు సమగ్ర ప్రణాళిక.

సెక్యూరిటీ రెగ్యులేషన్స్​ పాటించాలి.

సంస్థ ఏదైనా పరీక్షల నిర్వహణకు సంబంధించిన రూల్స్​ దాదాపు ఒకేలా ఉంటాయి.

జనరల్​ క్రిమినల్ చట్టాలతోపాటు పబ్లిక్ పరీక్షల చట్టం(25/97) ద్వారా పరీక్షల నిర్వహణని నియంత్రించొచ్చు.

పరీక్షల నిర్వహణ ప్రక్రియలను ప్రీ-–ఎగ్జామినేషన్, పోస్ట్-–ఎగ్జామినేషన్​గా విభజన.

సబ్జెక్టుల వివరాల్ని తప్పులు లేకుండా విద్యా సంస్థల నుంచి సేకరణ.

ఈ డేటా ఆధారంగా పరీక్ష కేంద్రాల్ని ఏర్పాటు, హాల్ టికెట్లను, ఆన్సర్, ఓఎంఆర్ షీట్లను ప్రింట్​ చేయించాలి.

ముందుగానే ఎగ్జామ్​ సెంటర్లకు పంపిణీ.

పరీక్షల నిర్వహణలో అతి ముఖ్యమైన క్వశ్చన్​ పేపర్ల రూపకల్పనకు బ్లూప్రింట్​ని స్ట్రిక్ట్​గా ఫాలో కావాలి.

క్వశ్చన్​ పేపర్లు స్టూడెంట్స్​ నాలెడ్జ్​ని, అండర్​స్టాండింగ్​ కెపాసిటీని పరీక్షించేలా ఉండాలి.

ప్రశ్నపత్రాల్లో సాధ్యమైనంత వరకు అక్షర దోషాలు, అనువాద లోపాలు లేకుండా చూడాలి. సిలబస్​ దాటి ప్రశ్నలు అడగకుండా, డౌటొచ్చే ప్రశ్నలు లేకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి.

-డాక్టర్ మధుసూదన్ రెడ్డి,  ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ప్రెసిడెంట్