తుమ్మల చెల్లని రూపాయి! : పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం టౌన్, వెలుగు : సత్తుపల్లిలో చెల్లని రూపాయి ఖమ్మంకు వచ్చిందని, ఖమ్మంలో చెల్లలేదని పాలేరు పోయిందని, పాలేరులో కూడా చెల్లకపోతే తిరిగి ఖమ్మం వచ్చిందని తుమ్మలను ఖమ్మం బీఆర్ఎస్  అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. తాను ఈమధ్యే వచ్చిన దగదగా మెరిసే వంద రూపాయల నాణాన్ని     అని పువ్వాడ అన్నారు. శుక్రవారం ఖమ్మం సిటీలో నామినేషన్ వేసే క్రమంలో పువ్వాడ పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తుమ్మలగడ్డ మజ్జిద్ లో ముస్లిం సోదరులను కలిసి ఓటు అభ్యర్థించారు. 44వ డివిజన్ లో పీఎన్ ఎస్వీ హాస్పిటల్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.

ఆ డివిజన్ కార్పొరేటర్ పాలేపు వెంకట విజయ నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించారు. అనంతరం రఘునాథపాలెం మండలంలోని కె.వి.బంజరలో రోడ్డు షో లో మాట్లాడారు. రఘునాధపాలెం మండలం గత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఏర్పాటయినట్లు తుమ్మల చెప్పడం అతడి అవగాహనారాహిత్యమని చెప్పారు. రఘునాథపాలెం మండలానికి తుమ్మల బొడ్డు కోసి పేరు పెట్టినట్లు మాట్లాడుతున్నారని, అతడు బొడ్డు కాదు..  మండలం గొంతు కోశారని మండిపడ్డారు.

మండలంగా నామకరణం చేసింది బీఆర్ఎస్  ప్రభుత్వం అని తెలిపారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న రఘునాథపాలెం మండలాన్ని డెవలప్​కు కేరాఫ్ అడ్రస్ గా మార్చానని చెప్పారు. తాను గెలిచిన రెండు సార్లు ప్రజల కోసం కూలీలాగా పనిచేసి అభివృద్ధి చేశానని తెలిపారు.  తుమ్మల ఎమ్మెల్యేగా, రోడ్ల మంత్రి గా ఉన్న ఈ మండలానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. తాను 24గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి చేశానని, ఇప్పుడు తనన మళ్లీ గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపేనే ఉందని చెప్పారు.