- నా ఆస్తి మొత్తం ప్రజలకిస్త
- తుమ్మల.. నాపై చేసిన ఆరోపణల్లో ఒక్కటైనా నిరూపించు
- మీకు ఆ దమ్ముందా?
- మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం: ‘నాపై చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటైనా నిరూపిస్తే.. నా ఆస్తి మొత్తం ఖమ్మం ప్రజలకు రాసిస్త. తుమ్మల.. మీకు ఆ దమ్ము ఉందా?’ అంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సవాల్విసిరారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తుమ్మల నాగేశ్వర్రావుపై విరుచుకుపడ్డారు. ‘గత ఎన్నికల్లో ఖమ్మంలో 9 మంది అభ్యర్థులు ఓడిపోవడానికి కారణం ఇద్దరు కరటక దమనకులే. చిన్నయసూరి అనే కవి చిన్న పిల్లల కోసం రాసిన కథలో రెండు గుంట నక్కలు విడిగా ఉండి ప్రజలను మోసం చేసేవి.
ఖమ్మం ప్రజలను మోసం చేసే అలాంటి వారి నటనకు ఆస్కార్ అవార్డు కూడా సరిపోదు. ఎన్నికల్లో గెలవడం కోసం ఈ స్థాయికి దిగజారాలా? పదవి కోసం విచక్షణ కోల్పోయి వ్యక్తిగత దూషణలకు దిగడం బాధాకరం. నేను చేసిన అభివృద్ధిని ఆయన చేసినట్లు చెప్పడం ఎలా ఉందంటే.. మందికి పుట్టిన బిడ్డను నాకు పుట్టారని చెప్పుకోవడంలా ఉంది’ అని ఎద్దేవా చేశారు.