తుమ్మల దిగజారి మాట్లాడుతుండు : పువ్వాడ

ఖమ్మం టౌన్, వెలుగు :   40  ఏండ్ల రాజకీయ అనుభవం, పరిజ్ఞానం ఉన్న వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావుకు కండ్ల ముందు  ఉన్న అభివృద్ధి కనబడటం లేదా అని బీఆర్​ఎస్​ అభ్యర్థి పువ్వాడ అజయ్​ కుమార్​ ప్రశ్నించారు.   సిటీలోని పలు డివిజన్ లలో  బుధవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పువ్వాడ   మాట్లాడారు.  తుమ్మల అభివృద్ధిని చూడకుండా.. అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు.  

తుమ్మల  ఖమ్మంలో పోటీ చేసేందుకు అయిష్టంగా వచ్చాడని  చెప్పారు.   పాలేరు టికెట్​ కావాలని అనుకున్నాడని, అక్కడ టిక్కెట్ దొరకకపోవడంతో బలవంతంగా ఖమ్మం పంపించారని తెలిపారు.  ఇక్కడ గెలవడానికి ఆయన చెప్పుకోవడానికి ఏమీ దని,  తాము చేసిన అభివృద్ధిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని  ఆరోపించారు.   ఖమ్మం అభివృద్ధిని చూసి, తనను గెలిపించాలని  కోరారు.