అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్​రావాలి : పువ్వాడ అజయ్​కుమార్​

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మంలోని డివిజన్ చర్చ్ కాంపౌండ్​లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్​కుమార్ పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. ప్రజల కష్టాల్లో కనపడని వ్యక్తి, కరోనా సమయంలో కాకరకాయ పంచని వ్యక్తి అవసరమా అని ప్రశ్నించారు.

అనంతరం నవంబర్5న ఖమ్మంలో జరగనున్న సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ కోసం స్థానిక డిగ్రీ కాలేజీ గ్రౌండ్ ను ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్రతో కలిసి పరిశీలించారు. అంతకు ముందు పువ్వాడ అజయ్​తరఫున ఆయన కొడుకు డాక్టర్​పువ్వాడ నయన్ రాజ్ సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రచారం చేశారు. మార్నింగ్ వాకర్స్, క్రీడాకారులను కలిసి బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు.