సర్కారు ప్రజాధనం వృథా చేస్తోంది : పువ్వాళ్ల దుర్గా ప్రసాద్

ఖమ్మం టౌన్, వెలుగు : బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమం పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తోందని, పథకాలను పార్టీ కార్యకర్తలకే పంచిపెడుతోందని జిల్లా కాంగ్రెస్  కమిటీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఆరోపించారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలోని సంజీవరెడ్డి భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు దగ్గరపుడుతున్న  కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా పథకాల పేరుతో బీఆర్ఎస్ కార్యకర్తలను మేపుతోందని మండిపడ్డారు.

దళిత బంధు, బీసీ ఋణాల చెక్కులు పంపిణీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని, దీనిపై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన  చేపడుతున్న లీడర్లపై అక్రమ కేసులు బనాయించడం నియంతృత్వనికి  నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోను బీఆర్ఎస్ కానీ కొట్టిందని తెలిపారు. కానీ బీఆర్​ఎస్​ నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు.

రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో  పీసీ సభ్యుడు, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, సీటీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొక్కా శేఖర్ గౌడ్, కార్పొరేటర్ మలీదు వెంకటేశ్వర్లు, ఖమ్మం నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.