- నా చేతిలో మంత్ర దండం ఉంటే మీ చేతిలో ఉన్నట్లే
- మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : తనకంటూ ఉన్న పెద్ద కుటుంబం తన పార్టీ సభ్యులేనని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం నగరంలోని మంత్రి క్యాంపు ఆఫీస్‌లో నిర్వహించిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మీరే నా బలగమని, ఈ స్థాయిలో ఉండటానికి మీరే కారణమన్నారు. కొందరు పార్టీని వీడి అవాకులు, చవాకులు పేలారన్నారు.
తనతోపాటు జిల్లా నుంచి ఎంత మందిని తీసుకుపోతానో చూడండి అని సవాల్ చేసిన వారు కనీసం ఈకను కూడా పీకలేకపోయారని ఎద్దేవా చేశారు. తన చేతుల్లో మంత్రదండం ఉంది అంటే అది మీ చేతుల్లో ఉన్నట్టేనని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో మేయర్ నీరజ, సుడా చైర్మెన్విజయ్కుమార్, క్రిష్ణ, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.