పీవీ స్మృతివనానికి డిసెంబర్‌‌‌‌‌‌‌‌ డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌!

పీవీ స్మృతివనానికి డిసెంబర్‌‌‌‌‌‌‌‌ డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌!
  • వర్ధంతిలోగా పూర్తి చేయాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌
  • రూ. 11 కోట్ల అంచనాతో మూడేండ్ల కిందప్రారంభమైన పనులు
  • నిధులు విడుదల చేయని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌.. మధ్యలోనే ఆగిన వర్క్స్‌‌‌‌‌‌‌‌
  • ఫండ్స్ విడుదల చేసి  స్మృతివనాన్ని డెవలప్‌‌‌‌‌‌‌‌ చేస్తామని మంత్రి పొన్నం హామీ

హనుమకొండ/భీమదేవరపల్లి, వెలుగు: భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మృతివనం నిర్మాణంపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టింది. రూ. 11 కోట్ల అంచనాతో మూడేండ్ల కిందే పనులు ప్రారంభమైనా గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఇప్పటివరకు పనులు పూర్తి కాలేదు. పీవీ జయంతి సందర్భంగా వంగరను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ పీవీ స్మృతివనాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పీవీ వర్ధంతిలోగా పనులు పూర్తి చేయాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌ పెట్టారు.

హామీలు ఇచ్చి మరిచిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌

పీవీ నరసింహారావు వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921 జూన్‌‌‌‌‌‌‌‌ 28న పుట్టారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో పెరిగిన ఆయన 2004 డిసెంబడ్‌‌‌‌‌‌‌‌ 23న తుదిశ్వాస విడిచారు. గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం 2020 జూన్‌‌‌‌‌‌‌‌ 28 నుంచి 2021 జూన్‌‌‌‌‌‌‌‌ 28 వరకు పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించింది. ఉత్సవాల ప్రారంభం సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ చాలా హామీలు ఇచ్చారు. ఇందులో ప్రధానంగా పీవీ పుట్టి పెరిగిన గ్రామాలను డెవలప్‌‌‌‌‌‌‌‌ చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఆఫీసర్లకు ఆదేశాలు సైతం జారీ చేశారు. లక్నేపల్లిలో కల్చరల్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌‌‌‌‌ నుంచి వంగర వరకు డబుల్‌‌‌‌‌‌‌‌ రోడ్డు, ఇరువైపులా బ్యూటిఫికేషన్, ముల్కనూరు నుంచి వంగర మార్గంలో ఆర్చి, గ్రామంలోని కైలాసనాథ టెంపుల్‌‌‌‌‌‌‌‌ అభివృద్ధి, వంగర చెరువును మినీ ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌గా మార్చడం, సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జి, ఏడెకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేసేందుకు ప్లాన్‌‌‌‌‌‌‌‌ రెడీ చేశారు. 

విడుదల కాని నిధులు.. నత్తనడకన పనులు

వంగరలో పీవీ స్మృతి వనం నిర్మాణం కోసం గత ప్రభుత్వం రూ.7 కోట్లు శాంక్షన్‌‌‌‌‌‌‌‌ చేసింది. తర్వాత పనుల్లో మార్పు, ట్యాక్స్‌‌‌‌‌‌‌‌లతో కలిపి బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను రూ.11 కోట్లకు పెంచారు. 2021లో పనులు మొదలుపెట్టి 2022 జయంతి నాటికి పూర్తి చేయాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకున్నారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌కు పనులు అప్పగించారు. దీంతో ముందుగా ఆడిటోరియం, సైన్స్‌‌‌‌‌‌‌‌ మ్యూజియం, గ్యాలరీ, సెమినార్‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌, మెడిటేషన్‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌ వంటి పనులు స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. కానీ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ నిధులు సకాలంలో రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేయకపోవడం స్మృతివనం పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభమై మూడేండ్లు అయినా 
ఇప్పటివరకు పూర్తి కాలేదు.

మంత్రి పొన్నం స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌

మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌ ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలో చాలాసార్లు వంగరతో పాటు పీవీ స్వగృహాన్ని సందర్శించారు. డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఏమీ కనిపించకపోవడంతో తాము  అధికారంలోకి వచ్చాక వంగరను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి రావడం, పొన్నం మంత్రి కావడంతో పీవీ స్మృతివనంపై స్పెషల్‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టారు. జూన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన పీవీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం స్మృతివనం పనులను పరిశీలించారు. స్మృతివనంలో పలు మార్పులు సూచించి, నిధుల కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత హనుమకొండ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ప్రావీణ్యకు ఆదేశాలు జారీచేయడంతో ఆమె గత నెలలో పీవీస్మృతి వనం పనులను పరిశీలించారు. రెండు నెలల్లోగా పనులు పూర్తి చేయాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌ పెట్టారు. దీంతో వారం, పది రోజుల్లోగా పనులు స్టార్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 23న పీవీ వర్ధంతి నిర్వహించనుండగా, ఆ లోగానే పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.