తెలుగు జాతికి పీవీ గర్వకారణం : కె.కేశవరావు

  • రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు 

నిర్మల్, వెలుగు : దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అపర చాణక్యుడని, తెలుగు జాతికే ఆయన గర్వకారణమని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కొనియాడారు. నిర్మల్​లో ఏర్పాటుచేసిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని సోమవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ.. ఆర్థిక పరంగా భారత్ ప్రపంచ దేశాలతో పోటీ పడేలా చేసిన గొప్ప రాజకీయ నీతిజ్ఞుడు పీవీ అని అన్నారు.

ఆర్థిక సరళీకరణ విధానాలతో దేశాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎంతో ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన గొప్ప నేతగా పీవీ నరసింహారావు చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ నాయకులు రాజేశ్వర్ పాండే, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.