యాదాద్రి, వెలుగు: మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్రావు చెప్పారు. వలిగొండ మండలం గోకారం, తుర్కపల్లిలో పీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఆదివారం గిఫ్ట్లు అందించి మాట్లాడారు. మహిళలు పారిశ్రామిక రంగంలో రాణించేందుకు ప్రత్యేకంగా రుణ సదుపాయం కల్పిస్తున్నారని గుర్తుచేశారు.
ఉజ్వల గ్యాస్, సుకన్య సమృద్ధి యోజన, ఆయుష్మాన్ భారత్, బేటి బచావో - బేటి పడావో, విశ్వకర్మ యోజన, పీఎం కిసాన్ నిధి, ముద్ర లోన్స్పథకాలతో అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుర్కపల్లి మాధవి, ఉప సర్పంచ్ మైసొళ్ల మత్స్యగిరి, ఎంపీపీ నూతి రమేష్, బీజేపీ లీడర్లు ఏలె చంద్రశేఖర్, నాగెల్లి సుధాకర్ గౌడ్, పోతంశెట్టి రవీందర్, దాసరి మల్లేశం, సీఎన్ రెడ్డి, తుమ్మల యుగెందర్ రెడ్డి, పిట్టల అశోక్, రాచకొండ కృష్ణ, ఏలూరి శ్యామ్, అనిల్ కుమార్, వెలిమినేటి వెంకటేశ్, డోగిపర్తి సంతోష్ ఉన్నారు.