కౌలాలంపూర్: ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్.. మలేసియా మాస్టర్స్‌లో బోణీ చేశారు. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆరోసీడ్ సింధు 21–13, 17–21, 21–18తో లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. 62 నిమిషాల మ్యాచ్‌లో సింధు బలమైన స్మాష్‌లు, సుదీర్ఘమైన ర్యాలీలతో అదరగొట్టింది. అయితే చిన్న తప్పిదాలతో రెండో గేమ్ కోల్పోయినా థర్డ్ గేమ్‌లో మళ్లీ జోరందుకుంది.
ఇతర మ్యాచ్‌ల్లో అష్మితా చాలిహా 17–21, 7–21తో హన్ యు (చైనా) చేతిలో, ఆకర్షి కశ్యప్ 17–21, 12–21తో అకానె యమగుచి (జపాన్) చేతిలో, మాల్వికా బన్సోద్ 11–21, 13–21తో రెండోసీడ్ వాంగ్ జి యి (చైనా) చేతిలో కంగుతిన్నారు. మెన్స్ సింగిల్స్‌లో శ్రీకాంత్ 21–12, 21–16తో టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)పై, హెచ్.ఎస్. ప్రణయ్ 16–21, 21–14, 21–13తో వరల్డ్ ఆరో ర్యాంకర్ చో టియెన్ చెన్ (చైనీస్‌తైపీ)కి షాకిచ్చాడు. మరో మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21–10, 16–21, 21–9తో ఏడో సీడ్ కీన్ యి లోహ్ (సింగపూర్)పై గెలిచాడు.