సింధు కోచ్‌‌‌‌గా లీ హ్యున్‌‌‌‌

సింధు కోచ్‌‌‌‌గా లీ హ్యున్‌‌‌‌

న్యూఢిల్లీ : ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి తన కోచ్‌‌‌‌ను మార్చింది. పారిస్ ఒలింపిక్స్‌‌‌‌లో నిరాశపరిచిన సింధుకు  సౌత్ కొరియాకు చెందిన లీ హ్యున్‌‌‌‌ యిల్‌‌‌‌  కన్సల్టింగ్ కోచ్‌‌‌‌గా వ్యవహరించనున్నాడు. 

మాజీ వరల్డ్ నంబర్ వన్ అయిన లీ హ్యున్  తాత్కాలికంగా సింధు కోచ్‌‌‌‌గా పని చేయనున్నాడు. సింధు ఇప్పటికే  మాజీ ఒలింపియన్‌‌‌‌, కోచ్‌‌‌‌ అనూప్ శ్రీధర్ ఆధ్వర్యంలో గత మూడు వారాల నుంచి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. 

ఈ ఏడాది డిసెంబర్ వరకూ శ్రీధర్‌‌‌‌‌‌‌‌ కూడా కోచ్‌‌‌‌గా పని చేయనున్నాడు. ఆ తర్వాత శాశ్వత కోచ్‌‌‌‌ నియామకంపై నిర్ణయం  రానుంది. కాగా, సింధు వచ్చే నెలలో ఫిన్లాండ్‌‌‌‌ ఓపెన్‌‌‌‌, డెన్మార్క్ ఓపెన్‌‌‌‌లో పోటీ పడనుంది.