
ఒడెన్స్ : ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. డెన్మార్క్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు 18–21, 21–12, 21–16తో నాలుగోసీడ్ హన్ యు (చైనా)పై గెలిచింది. దీంతో హన్‌తో ముఖాముఖి రికార్డును 7–1కి పెంచుకుంది.