
భారత స్టార్ షట్లర్ పివి సింధు ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ ఆడేందుకు సిద్దమవుతుంది. మంగళవారం (మార్చి 11) జరగనున్న ఈ టోర్నీ ఆడడానికి సింధుప్రైవేట్ జెట్‌లో రాయల్ గా యుకెకు బయలు దేరింది. సింధు తన ఆనందాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది. "వెళ్దాం. కొంచెం నవ్వండి కోచ్" అని సింధు తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో రాసింది.
PV Sindhu and her team off to Birmingham for All England 2025…🙏👌🤌🙌…
— Parth (@ParthK_23) March 8, 2025
Excited!
COMEONN @Pvsindhu1 ♥️ pic.twitter.com/C1fxQtXukd
ప్రస్తుతం భారత్ తరపున సింధు టాప్ షట్లర్. దీంతో ఈ ప్రధాన టోర్నీకి ముందు సింధుపై భారీగా అంచానాలు ఉన్నాయి. మాజీ ప్రపంచ ఛాంపియన్, 2016 రియో ఒలింపిక్స్ రజత పతక విజేత సింధు ఆల్ ఇంగ్లాండ్ టైటిల్‌ను అందుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ టోర్నమెంట్ మార్చి 11 నుండి 16 వరకు ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరగనుంది. అన్‌సీడెడ్ గా బరిలోకి దిగుతున్న సింధు తన తొలి మ్యాచ్‌లో దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ 22వ ర్యాంక్ క్రీడాకారిణి గా యున్ కిమ్‌తో ఆడనుంది.
ALSO READ | IND vs NZ Final: కుర్రాడిలా గవాస్కర్ చిందులు.. నవ్వు ఆపుకోలేపోయిన యాంకర్
సింధుతో పాటు మాళవిక బన్సోద్ మహిళల సింగిల్స్ లో ఆడనుంది. భారత్ కు చెందిన వీరిద్దరూ అన్‌సీడెడ్ ప్లేయర్లే కావడం గమనార్హం. వీరిద్దరికీ తొలి రౌండ్ లో కఠినంగా డ్రా ఎదురైంది. ఈ ఏడాది ప్రారంభంలో సింధు ఇండోనేషియా కోచ్ ఇర్వాన్‌శ్యా ఆది ప్రతామను తన కోచింగ్ సిబ్బందిలో చేర్చుకుంది. పివి సింధు బ్యాడ్మింటన్ లో రెండు సార్లు ఒలంపిక్ పథకాన్ని సాధించింది. 2016లో జరిగిన రియో ఒలంపిక్స్ లో రజతం.. 2020లో జపాన్ లో జరిగిన టోక్యో ఒలంపిక్స్ లో కాంస్యం పతకాలు సాధించింది.