డిసెంబర్ 22న పీవీ సింధు పెళ్లి..వరుడు ఎవరు.?ఏం చేస్తాడంటే.?

డిసెంబర్ 22న పీవీ సింధు పెళ్లి..వరుడు ఎవరు.?ఏం చేస్తాడంటే.?

హైదరాబాద్‌, వెలుగు: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు పెండ్లి పీటలు ఎక్కనుంది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వెంకట సాయి దత్తను 29 ఏండ్ల సింధు పెండ్లి చేసుకోనుంది. ఈనెల 22న ఉదయ్‌పూర్‌‌లో వీరి వివాహం  జరుగుతుందని  ఆమె తండ్రి పీవీ రమణ తెలిపారు. 20 నుంచే వేడుకలు ప్రారంభం అవనున్నాయి. ఈనెల 24న హైదరాబాద్‌లో రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. 

బెంగళూరు ఐఐటీలో చదివిన దత్తసాయి ప్రస్తుతం హైదరాబాద్‌కు చెందిన పొసిడెక్స్ టెక్నాలజీస్‌ అనే కంపెనీకి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌‌గా వ్యవహరిస్తున్నారు. సింధు, దత్తసాయి ఏడాదిగా ఒకరినొకరు ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని నెలల కిందట ఇరు కుటుంబాలు వీళ్ల పెండ్లికి ఒప్పుకున్నట్టు సమాచారం. సయ్యద్ మోదీ టోర్నీలో గెలిచి రెండేండ్ల విరామం తర్వాత టైటిల్ అందుకున్న సింధు  పెండ్లి తర్వాత కూడా తన కెరీర్‌‌ను కొనసాగించనుంది.