భారత ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు బిజినెస్ మెన్ వెంకటదత్త సాయి ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం డిసెంబర్ 22న ఉదయపూర్ లోని ఓ ప్రముఖ ప్యాలెస్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహానికి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. కానీ డిసెంబర్ 24న హైదరాబాద్ లో రిసెప్షన్ నిర్వహించగా టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతోపాటు పెద్ద ఎత్తున స్నేహితులు, సన్నిహితులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేటువంటి పివి సింధు హల్దీ ఫంక్షన్ ఫోటోలని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలలో వధూవరులు ఇద్దరూ సంతోషంగా కనిపించారు. దీంతో నెటిజన్లు పివి సింధు కి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read : నెట్ ఫ్లిక్స్ లో గ్లోబల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్న తెలుగు సినిమాలు
ఈ విషయం ఇలా ఉండగా పివి సింధు బ్యాడ్మింటన్ ఆటలో రెదను సార్లు ఒలంపిక్ పథకాన్ని సాధించింది. ఈ క్రమంలో 2016లో జరిగిన రియో ఒలంపిక్స్ లో రజతం, అలాగే 2020లో జపాన్ లో జరిగిన టోక్యో ఒలంపిక్స్ లో కాంస్యం పతకాలు సాధించింది. అంతేగాకుండా - భారతదేశం నుండి వచ్చి ఒలింపిక్స్‌లో వరుసగా పతకాలు సాధించిన ఏకైక బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ గా సింధు రికార్డులు క్రియేట్ చేసింది.