
న్యూఢిల్లీ: ఇండియా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో ప్రతిష్టాత్మక పురస్కారం ముంగిట నిలిచింది. ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు సింధు నామినేట్ అయింది. ఆమెతో పాటు టోక్యోలో సిల్వర్ మెడలిస్ట్ , వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, గోల్ఫర్ అదితి అశోక్, పారా షూటర్ అవని లేఖరా, బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ కూడా ఈ అవార్డుకు పోటీలో ఉన్నారు. ఈ నెల 28 వరకు ఆన్లైన్ ఓటింగ్ నిర్వహించి మార్చి 28న విన్నర్లను ప్రకటిస్తారు. ఈ అవార్డుతో పాటు లెజెండరీ ప్లేయర్ కు ‘బీబీసీ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు’, యంగ్ ప్లేయర్ కు ‘బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు కూడా అందజేస్తారు.