PV Sindhu: ఒక్కటైన పీవీ సింధు, వెంకట దత్త సాయి

PV Sindhu: ఒక్కటైన పీవీ సింధు, వెంకట దత్త సాయి

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, 29 ఏళ్ల వెంకట దత్త సాయితో ఆమె వివాహం జరిగింది. ఆదివారం రాత్రి 11.20 గంటలకు రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ లేక్‌లోని సుందరమైన రాఫెల్స్ హోటల్‌లో మూడుముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, పలువురు ప్రముఖుల నడుమ వీరి పెళ్లి వేడుక జరిగింది.   

ఈ పెళ్ళికి కేంద్రసాంస్కృతిక,  పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హాజరయ్యారు. ఆయన నూతన వధూవరులను నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని దీవించారు. అందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మంగళవారం (డిసెంబర్ 24) హైదరాబాద్‌లో వీరి రిసెస్షన్‌ జరగనుంది.

వెంకట దత్త సాయి హైదరాబాద్‌లోని పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 14 (శనివారం)న వీరి నిశ్చితార్థం జరిగింది.