సింధు జోరు..ఇండియా ఓపెన్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశం

సింధు జోరు..ఇండియా ఓపెన్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశం
  • కిరణ్‌‌‌‌‌‌‌‌ జార్జ్‌‌‌‌‌‌‌‌, సాత్విక్‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌ జోడీ కూడా..

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షట్లర్, రెండుసార్లు ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ పీవీ సింధు.. ఇండియా ఓపెన్‌‌‌‌‌‌‌‌ సూపర్‌‌‌‌‌‌‌‌–750 టోర్నీలో సత్తా చాటింది. గురువారం జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో అన్‌‌‌‌‌‌‌‌సీడెడ్‌‌‌‌‌‌‌‌ సింధు 21–15, 21–13తో వరల్డ్‌‌‌‌‌‌‌‌ 46వ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌ మనామి సుయిజు (జపాన్‌‌‌‌‌‌‌‌)పై గెలిచి క్వార్టర్‌‌‌‌‌‌‌‌ఫైనల్లోకి అడుగుపెట్టింది. 46 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో తెలుగు ప్లేయర్‌‌‌‌‌‌‌‌ స్మాష్‌‌‌‌‌‌‌‌లు, ర్యాలీలతో అదరగొట్టింది. తొలి గేమ్‌‌‌‌‌‌‌‌ ఆరంభం నుంచే పదునైన షాట్లతో చెలరేగిన సింధు బ్రేక్‌‌‌‌‌‌‌‌ వరకు 11–6 ఆధిక్యంలో నిలిచింది.

అయితే క్రమంగా పుంజుకున్న సుయిజు ఒకటి, రెండు పాయింట్లతో ఆధిక్యాన్ని 11–13, 13–14కు తగ్గించినా ఎక్కడా అధిగమించలేదు. ఈ దశలో పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ స్మాష్‌‌‌‌‌‌‌‌లు, డీప్‌‌‌‌‌‌‌‌ రిటర్న్స్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్న సింధు వరుస పాయింట్లతో ఆధిక్యాన్ని 20–14కు పెంచుకుంది. తర్వాతి గేమ్‌‌‌‌‌‌‌‌లో సుయిజు షటిల్‌‌‌‌‌‌‌‌ను నెట్‌‌‌‌‌‌‌‌కు కొట్టడంతో తొలి గేమ్‌‌‌‌‌‌‌‌ సింధు సొంతమైంది. కోర్టులు మారిన తర్వాత కూడా సింధు ఆధిపత్యమే కొనసాగింది. 5–0 లీడ్‌‌‌‌‌‌‌‌తో రెండో గేమ్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన సింధు క్రాస్‌‌‌‌‌‌‌‌ కోర్టు రిటర్న్స్‌‌‌‌‌‌‌‌తో 11–2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

బ్రేక్‌‌‌‌‌‌‌‌ తర్వాత సింధు మరింత ఒత్తిడి పెంచడంతో సుయిజు పాయింట్లు రాబట్టడంలో ఫెయిలైంది. దీంతో వరుసగా పాయింట్లు నెగ్గిన సింధు గేమ్‌‌‌‌‌‌‌‌తో పాటు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను కైవసం చేసుకుంది. విమెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో రుతుపర్ణ–-శ్వేతపర్ణ 6-–21, 7-–21తో బీక్‌‌‌‌‌‌‌‌ హ న–-లీ సో హి (కొరియా) చేతిలో, తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప 9–21, 21–23తో ఫుకుషిమ–మత్సుమోటో (జపాన్‌‌‌‌‌‌‌‌) చేతిలో, సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో అనుపమ ఉపాధ్యాయ 6–21, 9–21తో మియజాకీ (జపాన్‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడారు. 

వరుసగా ఆరు పాయింట్లు..

మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో కిరణ్‌‌‌‌‌‌‌‌ జార్జ్‌‌‌‌‌‌‌‌ 22–20, 21–13తో అలెక్స్‌‌‌‌‌‌‌‌ లానియర్‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌)పై చెమటోడ్చి గెలిచాడు. ఆరంభంలో దూకుడుగా ఆడిన అలెక్స్‌‌‌‌‌‌‌‌1–6తో తొలి గేమ్‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టాడు. అయితే వరుసగా అన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌ చేయడంతో పుంజుకున్న కిరణ్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌ను క్రమంగా తగ్గించాడు. అయినప్పటికీ బ్రేక్‌‌‌‌‌‌‌‌ వరకు అలెక్స్‌‌‌‌‌‌‌‌ మూడు పాయింట్ల ఆధిక్యంలో నిలిచాడు. అదే జోరుతో 14–20 లీడ్‌‌‌‌‌‌‌‌లోకి దూసుకెళ్లాడు. ఈ దశలో కిరణ్‌‌‌‌‌‌‌‌ అద్భుతంగా పోరాడాడు.

వరుసగా ఆరు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లను కాచుకుని 20–20తో స్కోరు సమం చేశాడు. ఈ వెంటనే మరో రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌‌‌‌‌‌‌‌ను సాధించాడు. రెండో గేమ్‌‌‌‌‌‌‌‌లో ఇద్దరు ప్లేయర్లు హోరాహోరీగా ఆడారు. అయితే అలెక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టిన స్మాష్‌‌‌‌‌‌‌‌లు వైడ్‌‌‌‌‌‌‌‌గా వెళ్లడంతో కిరణ్‌‌‌‌‌‌‌‌ 14–11 లీడ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కిరణ్‌‌‌‌‌‌‌‌ 19–13 ఆధిక్యంలో నిలిచాడు.

ఈ దశలో ఒకటి, రెండు నెట్‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌ చేసినా అలెక్స్‌‌‌‌‌‌‌‌ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో సాత్విక్‌‌‌‌‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌‌‌‌‌–చిరాగ్‌‌‌‌‌‌‌‌ షెట్టి 20–22, 21–14, 21–16తో కెన్యా మిత్సుహషి–హిరోకి ఒకుమర (జపాన్‌‌‌‌‌‌‌‌)పై గెలిచి క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించారు. మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌లో ధ్రువ్‌‌‌‌‌‌‌‌ కపిల–క్రాస్టో 18–21, 17–21తో మిడోరికవా–సైటో (జపాన్‌‌‌‌‌‌‌‌) చేతిలో కంగుతిన్నారు.