లక్నో: ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్.. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్–300 టోర్నీలో సెమీఫైనల్లో అడుగుపెట్టారు. శుక్రవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో టాప్‌సీడ్ సింధు 21–15, 21–17తో డాయ్ వాంగ్ (చైనా)పై గెలిచింది. 48 నిమిషాల మ్యాచ్‌లో తెలుగమ్మాయి మునుపటి ఫామ్‌ను చూపెట్టింది.
బలమైన స్మాష్‌లు, ర్యాలీలతో ఈజీగా ప్రత్యర్థికి చెక్ పెట్టింది. మెన్స్ సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్‌సీడ్ లక్ష్యసేన్ 21–8, 21–19తో మీరబా మైస్నమ్ (ఇండియా)పై, ప్రియాన్షు రజావత్ 21–13, 21–8తో ఎంగుయెన్ హాయ్ డాంగ్ (చైనా)పై నెగ్గారు. విమెన్స్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప 21–12, 17–21, 21–16తో ప్రియా–శ్రుతి మిశ్రాపై నెగ్గగా, రుతుపర్ణ–శ్వేతపర్ణ 9–21, 4–21తో బావో లి జింగ్–లి క్వియాన్ (చైనా) చేతిలో ఓడారు.
మెన్స్ డబుల్స్‌లో ఇషాన్ భట్నాగర్–శంకర్ ప్రసాద్ 21–12, 30–28తో కాంగ్ కాయ్ జింగ్–ఆరోన్ టాయ్ (మలేసియా)పై గెలిచారు. మిక్స్‌డ్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో 21–16, 21–13తో లూ బింగ్ కున్–హో లి యు (మలేసియా)ను ఓడించి ముందంజ వేశారు.