ఇండియా ఓపెన్‌‌‌‌ బరిలో సింధు, సేన్‌‌‌‌

ఇండియా ఓపెన్‌‌‌‌ బరిలో సింధు, సేన్‌‌‌‌

న్యూఢిల్లీ : స్టార్‌‌‌‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌‌‌‌ ఇండియా ఓపెన్‌‌‌‌ సూపర్‌‌‌‌–750 టోర్నీలో బరిలోకి దిగనున్నారు. ఈ నెల 14 నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో ఇండియా నుంచి మొత్తం 21 మంది ప్లేయర్లు పోటీపడుతున్నారు. ఇందులో మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌లో ముగ్గురు, విమెన్స్‌‌‌‌లో నలుగురు, మెన్స్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో రెండు జట్లు, విమెన్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో ఎనిమిది జోడీలు, మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌లో నాలుగు జోడీలు బరిలో ఉన్నాయి. గత రెండు ఎడిషన్లలో కేవలం 14 మందే పోటీపడ్డారు. కానీ ఈసారి ఆ సంఖ్య భారీగా పెరిగింది.

2024లో ఫైనల్‌‌‌‌ చేరిన సాత్విక్‌‌‌‌–చిరాగ్‌‌‌‌ మరోసారి అదే ఫామ్‌‌‌‌ను చూపెట్టాలని భావిస్తున్నారు. మెన్స్‌‌‌‌ సింగిల్స్​ సెమీస్‌‌‌‌లో వైదొలిగిన ప్రణయ్‌‌‌‌ ఈసారి టైటిల్‌‌‌‌పై గురి పెట్టాడు. లక్ష్యసేన్‌‌‌‌, సింధుపై కూడా భారీ అంచనాలున్నాయి. ఇక వరల్డ్‌‌‌‌ వైడ్‌‌‌‌గా ఒలింపిక్‌‌‌‌ చాంపియన్స్‌‌‌‌ విక్టర్‌‌‌‌ అక్సెల్సెన్‌‌‌‌, అన్‌‌‌‌ సీ యంగ్‌‌‌‌, వరల్డ్‌‌‌‌ నంబర్‌‌‌‌వన్‌‌‌‌ షి యుకీ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

2023 ఫైనలిస్ట్‌‌‌‌ అయిన అక్సెల్సెన్‌‌‌‌ అనారోగ్యంతో గతేడాది టోర్నీకి దూరంగా ఉన్నాడు. చైనా ద్వయం లియాంగ్‌‌‌‌ వీకెంగ్‌‌‌‌–వాంగ్‌‌‌‌ చెంగ్‌‌‌‌, ఆరోన్‌‌‌‌ చియా–సోమ్‌‌‌‌ వూ యిక్‌‌‌‌ (మలేసియా), కిమ్‌‌‌‌ అస్టర్ప్‌‌‌‌–అండెర్స్‌‌‌‌ రాస్‌‌‌‌ముసెన్‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌), ఫజర్‌‌‌‌ అల్ఫియాన్‌‌‌‌–మహ్మద్‌‌‌‌ రియాన్‌‌‌‌ అర్డియాంటో (ఇండోనేసియా) నుంచి గట్టీ పోటీ ఎదురుకానుంది.