
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటిదారి పట్టింది. గాయం నుంచి కోలుకొని వచ్చిన సింధు బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి పోరులో 21–-19, 13–-21, 13–-21తో కొరియాకు చెందిన 21వ ర్యాంకర్ షట్లర్ కిమ్ గ యున్ చేతిలో మూడు గేమ్స్ పాటు పోరాడి ఓడింది.
విమెన్స్ డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ జోడీ 21–17, 21–13తో షువో సంగ్–చైన్ హుయి యు (చైనీస్)పై నెగ్గి శుభారంభం చేసింది. మిక్స్‌డ్‌లో రుత్విక శివాని –-రోహన్ కపూర్ జోడీ 21–-10, 17–-21, 24–-22తో యి హాంగ్ వీ– -నికోల్ చన్ (తైపీ)పై గెలిచి రెండో రౌండ్‌లో అడుగు పెట్టింది.