కుమమోటో (జపాన్) : ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. జపాన్ సూపర్–500 టోర్నీలో ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టింది. గురువారం జరిగిన విమెన్స్ రెండో రౌండ్లో వరల్డ్ 20వ ర్యాంకర్ సింధు 21–17, 16–21, 17–21తో వరల్డ్ 23వ ర్యాంకర్ మిచెల్లి లీ (కెనడా) చేతిలో పోరాడి ఓడింది. దాంతో, ఈ టోర్నీలో ఇండియా పోరాటం ముగిసింది. లక్ష్యసేన్, డబుల్స్ షట్లర్లు పుల్లెల గాయత్రి, ట్రీసా జాలీ తొలి రౌండ్లలోనే ఓడి ఇంటిదారి పట్టారు.