
జియామెన్ (చైనా): బీడబ్ల్యూఎఫ్ సుదిర్మన్ కప్ ఫైనల్స్‌లో ఇండియా శుభారంభం చేయలేదు. ఆదివారం జరిగిన గ్రూప్–డి తొలి మ్యాచ్‌లో 1–4తో డెన్మార్క్ చేతిలో ఓడింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో తానీషా క్రాస్టో–ధ్రువ్ కపిల 13–21, 14–21తో టోఫ్ట్–మాగెలాండ్ చేతిలో, ప్రణయ్ 15–21, 16–21తో అంటోన్‌సెన్ చేతిలో ఓడారు. మెన్స్ డబుల్స్‌లో హరిహరన్–రూబెన్ కుమార్ 7–21, 4–21తో అండెర్స్ రాస్‌ముసెన్–కిమ్ అస్ట్రాప్ చేతిలో తేలిపోయారు. విమెన్స్ సింగిల్స్‌లో సింధు 20–22, 21–23తో జార్స్‌ఫెల్ట్ చేతిలో ఓడగా, విమెన్స్ డబుల్స్‌లో తానీషా క్రాస్టో–శ్రుతి మిశ్రా 21–13, 21–18తో నటాషా–అలెగ్జాండ్రాపై గెలిచారు.