భారత షట్లర్ పీవీ సింధు ఆఖరి మెట్టుపై నిరాశ పరిచింది. ఆదివారం (మే 26) జరిగిన మలేషియా మాస్టర్స్ ఫైనల్లో చైనాకు చెందిన వాంగ్ జి యి చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో పరాజయం పాలైంది. దీంతో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
సెమీఫైనల్‌లో బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్(థాయ్‌లాండ్)పై కళ్లు చెదిరే స్మాష్‌లతో అలరించిన సింధు.. ఫైనల్లో ఆ దూకుడు కనపరచలేకపోయింది. హోరాహోరీగా సాగిన మొదటి గేమ్‌ను వాంగ్ 21-16తో ముగించింది. అనంతరం రెండో గేమ్‌లో సింధు రెచ్చిపోయి ఆడింది. స్మాష్‌లు, రిటర్న్‌లతో వాంగ్ జిపై పూర్తి ఆధిక్యం కనపరిచింది. దీంతో రెండో గేమ్ 5-21 తేడాతో సింధ్ వశం అయ్యింది. అయితే, చివరి గేమ్‌లో మాత్రం భారత షట్లర్ వెనుకబడి పోయింది. మూడవ గేమ్‌ను 16-21తో కోల్పోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
PV Sindhu settles for silver in Malaysian Masters
— DD News (@DDNewslive) May 26, 2024
Playing a final on BWF World Tour after more than a year, PV Sindhu went down against China’s Wang Zhi Yi 21-16, 5-21, 16-21 in a thrilling women’s singles final at Malaysia Masters in Kuala Lumpur on Sunday.#PVSindhu… pic.twitter.com/axlvlQRQTo
సిందు ఈ ఏడాదిలో బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. చివరిసారి 2022 సింగపూర్ ఓపెన్‌ను గెలుచుకున్న భారత షట్లర్.. గతేడాది మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలిచింది.