అమిత్ షాతో పీవీ సింధు భేటీ

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు భేటీ అయ్యారు. శనివారం హైదరాబాద్ వచ్చిన ఆయన జూబ్లీహిల్స్ లోని సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆఫీసు మెస్ లో బస చేశారు. సింధు, ఆమె తండ్రి పీవీ రమణ అక్కడికి వెళ్లి షాను కలిశారు. దీన్ని ట్విట్టర్​లో అమిత్ షా షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

సింధు నిబద్ధత, కష్టపడే తత్త్వం, అంకిత భావం.. నేటి యువతకు స్ఫూర్తి అని కొనియాడారు. సింధు క్రీడా ప్రతిభకు అంతర్జాతీయంగా వస్తున్న ప్రశంసలకు దేశం గర్విస్తొందని ట్విట్టర్లో అమిత్​షా పేర్కొన్నారు. 

ALSO READ: పెర్‌‌‌‌ క్యాపిటా ఇన్‌‌కమ్‌‌ వేగంగా పెరగాలి : సీ రంగరాజన్‌‌    

అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయాల్లో ఏదో ఒక రంగం ప్రముఖులతో భేటీ అవుతున్నారు. ఇలా ఇప్పటికే తన తెలంగాణ టూర్లలో రామోజీరావు, పుల్లెల గోపీ చంద్, జూనియర్ ఎన్టీఆర్‌‌‌‌ ను కలిశారు.