పారిస్ ఒలింపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు మరో విజయాన్ని అందుకుంది. వరుసగా రెండో విజయంతో ప్రీ క్వార్టర్స్ దశకు చేరింది. బుధవారం (జూలై 31) కూబాతో జరిగిన మ్యాచ్ లో 21-5, 21-10 తో వరుస సెట్లలో ప్రత్యర్థి కూబాను చిత్తు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగిన సింధు అంచనాలకు తగ్గట్టు ఆడింది. తొలి పాయింట్ నుంచే పూర్తి ఆధిపత్యం చూపించింది. తొలి సెట్ లో వరుసగా 8 పాయింట్లను గెలిచింది. ఇదే ఊపులో సెట్ ను 21- 5 తేడాతో గెలుచుకుంది.
- ALSO READ | IND vs SL 2024: సూర్య, రింకూ సూపర్ బౌలింగ్.. గంగూలీ కెప్టెన్సీని గుర్తు చేస్తున్న గంభీర్
రెండో సెట్ లోనూ సింధు తన జోరు చూపించింది. దూకుడుగా ఆడుతూ ప్రత్యధి కూబాకు ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. సింధు దూకుడుకు ఆమె వద్ద సమాధానమే లేకుండా పోయింది. దీంతో 21-10 తో సెట్ తో పాటు మ్యాచ్ ను గెలుచుకుంది. తొలి మ్యాచ్ లో సింధు సునాయాస విజయాన్ని అందుకుంది. ఏకపక్షంగా ముగిసిన ఈ మ్యాచ్ లో మాల్దీవులకు చెందిన ఫాతిమాత్ పై 21-9, 21-6 తేడాతో గెలిచింది.
PV Sindhu!🔥 pic.twitter.com/rYeMkryWGT
— RVCJ Media (@RVCJ_FB) July 31, 2024