స్విస్ ఓపెన్ టైటిల్ పీవీ సింధు కైవసం

బాసెల్: స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ విమెన్ సింగిల్స్ టైటిల్ ను భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్స్ లో థాయ్‌ షట్లర్‌ బుసానన్‌తో సింధు తలపడింది. సింధు 21–16, 21–8 తో బుసానన్ పై వరుస సెట్లలో విజయం సాధించి టైటిల్ ను వశం చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు సింధు.. బుసాన‌న్‌తో 17 సార్లు పోటీ ప‌డగా.. ఒక్క‌సారి మాత్ర‌మే ఓడిపోయింది. 2019 హాంగ్‌కాంగ్ ఓపెన్‌లో మాత్ర‌మే ఓడిపోయింది. కాగా సింధుకు ఇది స్విస్ రెండో టైటిల్. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజ్ పీవీ సింధు కు శుభాకాంక్షలు తెలిపారు. 

ఇవి కూడా చదవండి..

తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కేంద్రంపై నిందలు

సోమ, మంగళవారాల్లో భారత్ బంద్