సయ్యద్ మోదీ టోర్నీలో పీవీ సింధు విజయం

సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు మెరిసింది. మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ లో మాల్విక భన్సోద్ పై 21-13, 21 -16తో విజయం సాధించింది. బాబు బనారసి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ సింధు దూకుడుతో కేవలం 35 నిమిషాల్లోనే ముగిసింది. రెండుసార్లు ఒలింపిక్ మెడల్స్ సాధించిన సింధు ఆట ప్రారంభం నుంచి దూకుడు కొనసాగించింది. ప్రత్యర్థికి అవకాశమివ్వకుండా వరుస సెట్లను గెలుచుకుంది.  

ఇదే టోర్నీలో మెన్స్ సింగిల్స్ ఆర్నాడ్ మెర్కెల్, లుకాస్ క్లార్ బౌట్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉండగా అది రద్దైంది. వీరిలో ఒకరికి కొవిడ్ పాజిటివ్ నిర్థారణ కావడంతో నిర్వాహకులు మ్యాచ్ రద్దు చేశారు. 

For more news..

32 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం

గోవా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రతిజ్ఞ