పీవీ విజ్ఞాన కేంద్రం పనులు స్పీడప్​ చేయాలి : కలెక్టర్​ప్రావీణ్య

హనుమకొండ, వెలుగు : మాజీ ప్రధాని పీవీ స్వగ్రామం వంగరలో నిర్మిస్తున్న పీవీ విజ్ఞాన కేంద్రం పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్​ ప్రావీణ్య ఆఫీసర్లను ఆదేశించారు.  హనుమకొండ  కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో గురువారం ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో రివ్యూ చేశారు.  ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ..   పంచాయతీ రాజ్ శాఖ  పనులు ఏమైనా మిగిలి ఉంటే వాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు.  సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఆర్డీవో మేన శ్రీను, సీపీవో సత్యనారాయణ రెడ్డి, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేశ్​, ఆర్ అండ్ బీ ఈఈ సురేశ్ బాబు పాల్గొన్నారు.

హెవీ డ్రైవర్స్​ బండ్లను జాగ్రత్తగా నడపాలి

ములుగు రోడ్డు పరిధిలోని ఆర్టీసీ  ట్రైనింగ్​ కాలేజీలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో  లైట్, హెవీ మోటార్  డ్రైవింగ్ శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు  కలెక్టర్ అందజేశారు.  ఎస్సీ కార్పొరేషన్ జీఎం ఆనంద్,  డీటీసీ శ్రీనివాస్, ఆర్టీసీ  డైరెక్టర్ ట్రైనింగ్ సుధా పరిమళ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, ఆర్టీసీ ఐటీఐ ప్రిన్సిపల్ అర్పిత పాల్గొన్నారు.