మలయాళ సూపర్ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్(Manjummel Boys) తెలుగు వెర్షన్ కు పీవీఆర్ సంస్థ షాకిచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న పీవీఆర్ ఐనాక్స్(PVR-INOX) థియేటర్స్ లో మంజుమ్మల్ బాయ్స్ ప్రదర్శన నిలిపివేశాయి. దీంతో తెలుగులో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ కి భారీ నష్టం వాటిల్లింది. దీంతో మైత్రి మేకర్స్ పీవీఆర్ సంస్థపై మండిపడుతున్నారు.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. కేరళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ లోని కొంతమంది సభ్యులు కలిసి ఓ కంటెంట్ ప్రొవైడింగ్ కంపెనీ స్థాపించారు. పిడిసి(PDC) పేరుతో మొదలైన ఈ కంపెనీ నుంచే అన్ని థియేటర్లు డిజిటల్ ప్రింట్స్ కొనాలని మ్యాండేడ్ రిలీజ్ చేశారట. అయితే.. ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ సంస్థగా పేరున్న పివిఆర్ ఐనాక్స్ పిడిసి(PDC) నుంచి కంటెంట్ కొనకూడదు అని ఫిక్స్ అయ్యారట. అంతేకాకుండా.. తమను ఇబ్బంది పెట్టాలని చూసిన మలయాళ సినిమాలను ఇకనుండి ప్రదర్శించకూడదని అని నిర్ణయం తీసుకుందట. ఆ కారణంగానే.. మలయాళ సినిమాలన్నింటినీ నిలిపివేసిందట పీవీఆర్.
Also Read:దుల్కర్ సల్మాన్ మిడిల్ క్లాస్ భాస్కర్
కేరళ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు కొత్తగా తీసుకువచ్చిన మాండేట్ ఎత్తివేసే వరకు.. మలయాళ సినిమాలను తమ ధియేటర్లలో ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది పివిఆర్. దీంతో ఇటీవల తెలుగులో విడుదలైన మంజుమ్మల్ బాయ్స్ సినిమాకు షాక్ తగిలింది.