హైదరాబాద్, వెలుగు: ట్యాక్స్ సర్వీస్‌లను అందించే పీడబ్ల్యూసీ ఇండియా తమ ఉ ద్యోగుల స్కిల్స్‌ను మెరుగుపరిచేందుకు విద్యాపీఠ్ పేరుతో ఓ లెర్నింగ్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఓపెన్ చేసింది. ఈ సెంటర్ విస్తీర్ణం 60 వేల చదరపు అడుగులని, ఇండియాలో ఉన్న తమ 57 వేలకు పైగా ఉద్యోగులకు ఇక్కడ ట్రెయినింగ్ ఇవ్వొచ్చని కంపెనీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది.
ఉద్యోగుల లీడర్‌షిప్ క్వాలిటీస్‌ను పెంచడం, ఇన్నోవేషన్స్‌కు సపోర్ట్‌గా నిలవడం ఈ సెంటర్ ప్రధాన లక్ష్యం. మొదటి ఏడాదిలో ఏడు వేల మంది ఉద్యోగులకు లీడర్‌షిప్ స్కిల్స్‌ను నేర్పిస్తారు. పది వేల మందికి పైగా ఉద్యోగులకు డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లను, ఇండస్ట్రియల్ స్కిల్స్‌ను నేర్పిస్తారు.