PwC Layoffs: మాస్‌ లేఆఫ్స్‌.. 1800 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం

PwC Layoffs: మాస్‌ లేఆఫ్స్‌.. 1800 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం

రెండేళ్ల క్రితం మొదలైన ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలు కొనసాగుతూనే . ఏ రోజు ఎవరి ఉద్యోగాలు ఊడతాయో.. ఎంతమంది రోడ్డున పడతారో తెలియని పరిస్థితి. తాజాగా, ప్రముఖ ఆర్ధిక సేవల సంస్థప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్‌ (PwC) మాస్‌ లేఆఫ్స్‌కు తెగబడింది. దాదాపు 1800 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది.

సంస్థలకు ఆడిటింగ్, అకౌంటింగ్ సేవలు అందించే ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ అమెరికాలో దాదాపు 1,800 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ కోతలు సంస్థ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 2.5 శాతం మందిపై ప్రభావం చూపనున్నాయి. 2009 తరువాత కంపెనీ ఇంత పెద్ద స్థాయిలో లేఆఫ్స్‌కు సిద్దమవ్వడం ఇదే మొదటిసారి. లేఆప్స్ ప్రభావం అసోసియేట్‌ల మొదలు మేనేజింగ్ డైరెక్టర్ల వరకు వివిధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపై పడనుంది. ప్రధానంగా పీడబ్ల్యూసీ అడ్వైజరీ, ప్రోడక్ట్స్‌, టెక్నాలజీ ఆపరేషన్స్‌ విభాగాలపై ఉండనుంది.

ALSO READ : డిమాండ్ అట్లుందీ : ఈ కారు కొనాలంటే.. ఆరు నెలలు వెయిట్ చేయాలి

ఉద్యోగాలు కోల్పోతున్నవారిలో దాదాపు సగం మంది అమెరికా వెలుపల పనిచేసే వారే. ఆర్థిక కష్టాలు, సంస్థ విస్తృత పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నివేదికలు వెల్లడించాయి. మార్కెట్‌ అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో సంస్థ భవిష్యత్తు పటిష్టంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ చర్యలు చేపట్టామని ఉద్యోగులకు మెమోలో వివరించామని పీడబ్ల్యూసీ యూఎస్‌ లీడర్‌ పౌల్‌ గ్రిగ్స్‌ తెలిపారు.