జూబ్లీహిల్స్, వెలుగు: పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలోని సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం పూర్తిగా ఫెయిల్ అయిందని పోగ్రెసివ్ యూత్ లీగ్(పీవైఎల్) రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్.ప్రదీప్ఆరోపించారు. అటెండెంట్లు చెట్ల కింద పడుకుంటూ.. రాత్రిపూట చలిలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పీవైఎల్ఆధ్వర్యంలో బుధవారం నిమ్స్ వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అరెస్ట్‌చేసి బంజారాహిల్స్, ఎస్సార్నగర్పీఎస్లకు తరలించారు. ఈ సందర్భంగా ప్రదీప్మాట్లాడుతూ.. తాము నిమ్స్‌లో చేపట్టిన సర్వేలో పలు సమస్యలను గుర్తించామన్నారు.
మందుల ధరలు బయటకంటే తక్కువ ఉండాలని, అయితే నిమ్స్‌లోనే ఎక్కువ ఉన్నాయన్నారు. మెడికల్‌షాపులను నిమ్స్ యాజమాన్యమే నిర్వహించాలని, పార్కింగ్‌కు, టాయిలెట్లకు ఫీజు వసూలు చేయడం బంద్చేయాలన్నారు. జనరిక్ మెడికల్‌షాపు ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డి.స్వరూప, నగర అధ్యక్షు రాలు లక్ష్మీబాయి, పీవైఎల్నగర అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, కృష్ణ, భీమేశ్, మల్లేశ్, రాజు, పుష్ప పాల్గొన్నారు.