మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్​ను అడ్డుకుంటాం

మెట్రో స్టేషన్లలో పెయిడ్ పార్కింగ్​ను అడ్డుకుంటాం
  • పీవైఎల్, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ హెచ్చరిక 

హైదరాబాద్ సిటీ, వెలుగు : నాగోలు, మియాపూర్ మెట్రో స్టేషన్లలో పెయిడ్​పార్కింగ్​అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 5న ఆయా స్టేషన్ల వద్ద ధర్నా నిర్వహిస్తామని పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ ప్రదీప్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేశ్, ఆనగంటి వెంకటేశ్, ఏఐవైఎఫ్ ఆర్గనైజ్ సెక్రెటరీ శ్రీకాంత్ తెలిపారు. మొండిగా బలవంతపు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే అడ్డుకుంటామని, తర్వాత జరిగే తీవ్ర పరిణామాలకు ఎల్అండ్ టీ, మెట్రో సంస్థలే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. 

పెయిడ్​ పార్కింగ్ ఆలోచనను విరమించుకోవాలని కోరారు. ఈ మేరకు బుధవారం పీవైఎల్ స్టేట్​ఆఫీసులో వారు మీడియాతో మాట్లాడారు. మెట్రో యాజమాన్యం నామమాత్రపు పార్కింగ్​ఫీజు వసూలు పేరుతో ప్రయాణికులను మభ్యపెడుతోందని మండిపడ్డారు. పీవైఎల్ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బి.ఎస్.కృష్ణ, ఏఐవైఎఫ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.