ప్రశ్నించే స్థాయికి యువత ఎదగాలి : ప్రదీప్

ఆర్మూర్, వెలుగు: ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వాలను ప్రశ్నించే స్థాయికి యువత ఎదగాలని పీవైఎల్​ రాష్ట్ర కార్యదర్శి  ప్రదీప్  అన్నారు. మంగళవారం పట్టణంలోని కుమార్ నారాయణ  భవనంలో పీవైఎల్ జిల్లా ప్రెసిడెంట్​  కిషన్ అధ్యక్షతన  జిల్లా మహాసభ జరిగింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పనికిరాని పథకాలతో ప్రజల్లో, యువకుల్లో ఐక్యతను కేసీఆర్​ దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో   మారుతీ గౌడ్, అనీశ్, రవి, శ్రీనివాస్, గంగాధర్, దయాల్ సింగ్, విజయ్ కుమార్, బాలకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.