వచ్చే ఏడాదిలో 5 లక్షల డెలివరీ జాబ్స్‌

వచ్చే ఏడాదిలో  5 లక్షల డెలివరీ జాబ్స్‌

న్యూఢిల్లీ: క్విక్‌ కామర్స్ ఇండస్ట్రీ లక్షలాది జాబ్స్​ ఇవ్వనుంది. వచ్చే ఏడాదిలో ఈ ఇండస్ట్రీ సైజ్‌ 5 బిలియన్ డాలర్ల (రూ.43,500 కోట్ల) కు చేరుకుంటుందని,  కొత్తగా 5–5.5 లక్షల ఉద్యోగాలను ఇస్తుందని  టీమ్‌లీజ్‌ సర్వీసెస్ రిపోర్ట్​ పేర్కొంది. ప్రస్తుతం క్విక్ కామర్స్ ఇండస్ట్రీలో 2.5–3 లక్షల మంది డెలివరీ పార్టనర్లు పనిచేస్తున్నారు. మరో 75 వేల మంది ఆఫీసులు, స్టోర్లలో  పనిచేస్తున్నారు. 10–15 నిమిషాల్లో డెలివరీ చేపట్టడాన్ని క్విక్‌ కామర్స్ అంటున్నారు. జెప్టో, బ్లింకిట్   వంటివి ఈ ఇండస్ట్రీలో లీడర్లు.