ఖతార్‌లో 8 మంది భారతీయులకు మరణశిక్ష రద్దు..

ఖతార్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారతీయులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. ఎనిమిది మాజీ నేవీ ఆఫీసర్లలో, ఏడుగురు ఇప్పటికే భారతదేశానికి తిరిగి వచ్చినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో భారత నేవీ దళం హర్షం వ్యక్తం చేసింది. 

 ఏం జరిగిందంటే..

భారత్‌కు చెందిన ఎనిమిది మంది మాజీ మెరైన్లు దోహాకు చెందిన అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్‌లో పనిచేశారు. తమ సమాచారాన్ని దొంగలిస్తున్నట్టు ఎనిమిది  మంది సౌరభ్‌ వశిష్ఠ్‌, నవతేజ్‌ గిల్‌, కమాండర్లు బీరేంద్ర కుమార్‌ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్‌ పాకాల, సంజీవ్‌ గుప్తా, అమిత్‌ నాగ్‌పాల్‌, సెయిలర్‌ రాగేశ్‌ చెందిన అధికారుల పై అక్కడి ప్రభుత్వం కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ఏడాదికి పైగా జైలు జీవితంలో పలుమార్లు విచారించి   ఈ మాజీ మెరైన్‌లకు ఖతార్‌లోని దిగువ కోర్టు గత ఏడాది అక్టోబర్‌లో మరణశిక్ష విధించింది.

 దీని పై భారత ప్రభుత్వం స్పందిస్తూ మరణ శిక్ష పై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అక్కడి కోర్టులో అప్పీల్ చేసింది. మరణ శిక్షను రద్దు చేయించేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరంగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు పూర్తి విచారణ జరిపిన న్యాయస్థానం మరణ శిక్షను జైలు శిక్షగా మారుస్తూ డిసెంబర్‌ 28న తీర్పునిచ్చింది. దీన్ని కూడా అప్పీలు చేసుకునేందుకు 60 రోజుల గడువిచ్చింది. ప్రభుత్వం మరోసారి అపీల్ చేసి వారి విడుదలకు కృషి చేసింది. ఇవాళ ఉదయం ఏడుగురు మాజీ మెరైన్లు భారత్ లో ల్యాండ్ అయ్యారు.

ALSO READ :- బీసీలపై గత ప్రభుత్వానివన్నీ ఆర్భాటాలే: పొన్నం ప్రభాకర్