న్యూఢిల్లీ : క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ లిమిటెడ్ ఐపీఓ జనవరి ఏడో తేదీన మొదలై తొమ్మిదో తేదీన ముగుస్తుంది. ప్రైస్ బ్యాండ్‌ను రూ.275–290 మధ్య నిర్ణయించినట్టు కంపెనీ ప్రకటించింది. యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ఈ నెల ఆరో తేదీన ఉంటుంది. ఇన్వెస్టర్లు కనీసం 50 ఈక్విటీ షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో రూ.290 కోట్ల ఫ్రెష్ఇష్యూ మాత్రమే ఉంటుంది. ఓఎఫ్ఎస్ పోర్షన్ ఉండదు.
ఐపీఓ ద్వారా వచ్చిన రూ.149.72 కోట్లను లాంగ్‌టర్మ్ వర్కింగ్ క్యాపిటల్అవసరాల కోసం కేటాయిస్తారు. మరో రూ.24.37 కోట్లు ఎలక్ట్రిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ డెవెలప్మెంట్ కోసం, రూ.23.62 కోట్లను అప్పుల చెల్లింపు కోసం, సాధారణ కార్పొరేట్అవసరాల కోసం వాడతారు. రీసెర్చ్కంపెనీ అయిన క్వాడ్రంట్ న్యూ జెనరేషన్ ట్రెయిన్ కంట్రోల్, సిగ్నలింగ్ సిస్టమ్‌లను ఇండియన్రైల్వే కవచ్ ప్రాజెక్ట్ కోసం తయారు చేస్తుంది. ఐపీఓ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ అవుతాయి.