
- ప్రతి నియోజకవర్గంలో నాలుగైదు వేల మందికి లబ్ధి: సీఎం రేవంత్
- ఎమ్మెల్యేలు మండలాల్లో మీటింగ్ లు పెట్టి అర్హులను గుర్తించాలి
- కార్యకర్తలకు ఇవ్యొచ్చు.. కానీ అర్హత కచ్చితంగా ఉండాలి
- ఉద్యోగాలు.. ఉపాధి.. స్కిల్ డెవలప్మెంట్కు ప్రయారిటీ
- పన్నుల వసూళ్లు, ఇన్ ఫ్లేషన్ కంట్రోల్లో తెలంగాణ టాప్
- దుబారా తగ్గించి.. ఆదాయం పెంచుతున్నం
- ఇద్దరు మంత్రులను తీసేస్తే పాలనపై పట్టున్నట్టా?
- అందరినీ సమన్వయం చేసుకొని పాలన చేస్తే పట్టున్నట్టా? అని ప్రశ్న
- రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్లు ప్రారంభం
హైదరాబాద్. వెలుగు: అర్హులైన నిరుద్యోగ యువకులకే రాజీవ్ యువ వికాసం పథకం వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువకులతోపాటు ఎమ్మెల్యేల వెంట ఉన్న కార్యకర్తలకు సైతం ఈ స్కీమ్ కింద స్వయం ఉపాధి కల్పించాలని, కాకపోతే వారంతా కచ్చితంగా అర్హులై ఉండాలని సూచించారు.
ఇందుకోసం రాబోయే 2 నెలల్లో ఎమ్మెల్యేల చేతుల్లో రూ.6 వేల కోట్లు పెట్టబో తున్నట్లు చెప్పారు. అర్హుల గుర్తింపు కోసం ఎమ్మెల్యేలు మండలాల్లో మీటింగులు పెట్టుకోవాలని సూచించారు. పారదర్శకంగా పథకాన్ని అమలు చేయాలని, అర్హులకు మాత్రమే ఇవ్వాల ని తెలిపారు. అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడారు.
"ఈ పథకంలో మన వెంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్త లు, గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువకులందరికీ పని కల్పించొచ్చు. కానీ, అర్హత ఉందా? లేదా? అని చూడా ల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలదే. ఐదంతస్తుల భవనం ఉన్నా రూ.5 లక్షలు ఇస్తా అంటే కుదరదు. గతంలో అలా చేసినోళ్లు ఎక్కడ ఉన్నారో చూస్తున్నాం. ఇప్పుడు అలా నచ్చది.
నిజమైన నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం పథకం అందాలి. దాంతో ప్రభుత్వం పైవిశ్వాసం కలగాలి" అని పేర్కొన్నారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తన దగ్గరకు వచ్చి, తమ వెంట ఉన్న వారికి ఏం చేయలేకపోతున్నామని చెప్పు న్నారని.. అందులో భాగంగానే అర్హత ప్రకారం రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్వయం ఉపాధి కింద నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. జూన్ 2న లబ్దిదారులను ప్రకటించబోతున్నట్టు చెప్పారు..
పాలనపై పట్టు అంటే అధికారులను జైలుకు పంపడమా ?
14 నెలల కాలంలో ఎన్నో పథకాలు, మరెన్నో డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేసినా తనకు పరిపాలనపై పట్టు వచ్చినట్లు లేదని అంటున్నారని సీఎం రేవంత్ అన్నారు. ఒక ఇద్దరు మంత్రులను తీసి బయటప చేస్తేనో... ఇద్దరు అధికారులను జైలుకు పంపిస్తేనో పట్టు వచ్చినట్లు కాదని, ఉన్నోళ్లందరినీ సమన్వయం చేసుకొని సమీకరించుకొని ఒక మంచి పరిపాలన అందిస్తేనే పాలనపై పట్టు వచ్చినట్టు అని తెలిపారు. ఏదైనా విరగొట్టడానికి ఎక్కువ సమయం పట్టడని, కట్టడానికే సమయం పడుతుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం సాయంగా ఉంటుందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో 10 నెలల్లోనే 57,924 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం దేశంలోనే లేదని పేర్కొన్నారు.
గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్టు చెప్పారు. స్వయం సహాయక సంఘాల మహిళలకే పాఠశాలల నిర్వహణ బాధ్యత అప్పగిస్తు న్నామని తెలిపారు. మహిళలకు త్వరలోనే 1.20 కోట్ల చీరలు పంపిణీ చేస్తామని చెప్పారు.
గతంలో ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు ఇచ్చారని, అయితే కరెంట్ ఇవ్వలేదన్నారు. తాము రాష్ట్రవ్యాప్తంగా 29,550 పా ఠశాలలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి రూ.5,500 కోట్లు చెల్లించామని చెప్పారు. రైతులకు రూ.20.617 కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. ఉద్యోగాలు పారదర్శకంగా ఇవ్వడంతోనే ఎక్కడా చిన్న ఆరోపణ ప్రభుత్వంపై రాలేదన్నారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్లలోనూ ఎక్కడా ఆరోపణలు రాలేదన్నారు