చదువు చెప్పే జాబ్

డీసెట్….

రెండు తెలుగు రాష్ట్రా ల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ లోడిప్లొమా కోర్సును అభ్యసించడానికి రాయాల్సినప్రవేశ పరీక్ష డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కామన్​ ఎంట్రన్స్​ టెస్ట్ (డీఈఈ సెట్‌ ). దీని ద్వారారెండేళ్ల డీఈడీ/టీటీసీలో అడ్మిషన్​ పొందవచ్చు.అనంతరం డీఎస్సీ/టీఆర్టీ/ఇతర కేంద్ర, రాష్ట్ర పాఠశాలల పరీక్షలు రాసి ఎలిమెంటరీ/సెకండరీ గ్రేడ్టీచర్/ప్రైమరీ టీచర్ గా ఉద్యోగం పొందవచ్చు.

ఎడ్‌ సెట్‌..

తెలుగు రాష్ట్రా ల్లో రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశంపొందడానికి రాయాల్సిన ప్రవేశ పరీక్ష ఎడ్యుకేషన్‌కామన్‌ ఎంట్రెన్స్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ (ఎడ్‌‌‌‌సెట్‌ ). దీని ద్వారా ప్రభు-త్వ/ప్రైవేటు/ఎయిడెడ్ ఇన్​స్టి ట్యూషన్లలో రెండేళ్లబీఈడీ కోర్సు చదవ వచ్చు. కోర్సు పూర్తయ్యాకడీఎస్సీ/టీఆర్టీ/ఇతర కేంద్రీయ పాఠశాలల పరీక్షలు ద్వారా స్కూల్ అసిస్టెంట్​/టీజీటీ/పీజీటీ జాబుల్లో చేరొచ్చు.

అర్హత పరీక్షలు

టెట్‌…

ఇది ఆయా రాష్ట్రా ల్లో టీచర్‌‌‌‌ ఉద్యోగానికి పోటీపడటానికి ఉన్న అర్హత పరీక్ష. ఇందులో రెండు పేపర్లుంటాయి. అవి పేపర్‌‌‌‌-1, పేపర్‌‌‌‌-2. ఒకటి నుంచిఐదోతరగతి వరకు బోధించాలనుకునే వారు పేపర్‌‌‌‌-1 మరియు 6 నుంచి పదో తరగతి వరకు బోధిం-చాలనుకునేవారు పేపర్‌‌‌‌-2 రాయాలి. దీనిని ఏటారెండు సార్లు నిర్వహించాలని నేషనల్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఆఫ్‌టీచర్‌‌‌‌ ఎడ్యుకేషన్‌ నిర్ణయించింది. ఒకసారి టెట్‌ లోఅర్హత సాధిస్తే ఆ మార్కులకు 7 సంవత్సరాల వరకువ్యాలిడిటీ ఉంటుం ది. దీంతో ఈ కాలంలో వచ్చేటీచర్ నోటిఫికేషన్లకు పోటీ పడవచ్చు. మార్కులుపెంచుకునేందుకు ఎన్ని సార్లైనా టెట్‌ రాయవచ్చు.టెట్‌ కు 20 శాతం వెయిటేజీ ఇచ్చారు.

సీటెట్‌…

విద్యా హక్కు చట్టంలో నిర్దేశించిన లక్ష్యాలనుసాధించి ఉపాధ్యాయ విద్యలో ఉన్నత ప్రమాణా-లు నెలకొల్పేందుకు నేషనల్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఆఫ్‌ టీచర్‌‌‌‌ ఎడ్యుకేషన్‌ కొన్ని మార్గదర్శకాలు రూపొందించిం ది. ఇందులో భాగంగా 2011లో సీటెట్‌ పరీక్షనుప్రవేశపెట్టిం ది. కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్ష రాయాలంటేసీటెట్‌ లో అర్హత సాధించాలి. సీటెట్‌ రాసిన వారురాష్ట్రా ల్లో ని ఉపాధ్యాయ పరీక్షలకు కూడా అర్హులే .ఈ పరీక్షను ఏటా ఫిబ్రవరి, సెప్టెంబర్‌‌‌‌లో సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు . ఇందులోఒకసారి అర్హత సాధిస్తే ఏడు సంవత్సరాల వరకుఆ మార్కులు పరిగణనలోకి తీసుకుంటారు. ఈపరీక్షను ఎన్ని సార్లైనా రాయవచ్చు.ఉపాధ్యాయ విద్యలో రోజురోజుకు పడిపోతున్నప్రమాణాలను మెరుగు పర్చేందుకు దేశవ్యాప్తంగాఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియమితులు అవడానికి ఉండాల్సిన కనీస విద్యారత్హ లను2014లో ఎన్సీటీఈ రూపొందించింది సాధారణ టీచర్‌ అర్హతలు……

ప్రీ-స్కూల్‌ /నర్సరీ:

50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమానంఉత్తీర్ణత. మరియు నర్సరీ లేదా ప్రీ స్కూల్‌‌‌‌ ఎడ్యుకేషన్ లో రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత తప్పనిసరి. లేదాఎన్‌ సీటీఈ గుర్తింపు పొందిన సంస్థ నుంచి బీఈడీ(నర్సరీ) ఉత్తీర్ణత.

ప్రైమరీ/అప్పర్‌ ప్రైమరీ (1 –5వ తరగతి వరకు):.

50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమానంమరియు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యు-కేషన్లో ఉత్తీర్ణత ఉండాలి. లేదా 50 శాతం మార్కు-లతో ఇంటర్ లేదా తత్సమానం మరియు నాలుగేళ్లబ్యాచిలర్‌‌‌‌ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ లో ఉత్తీర్ణత.లేదా 50 శాతం మార్కులతో ఇంటర్ / తత్సమానం మరియు రెండేళ్ల డిప్లొమా ఇన్‌ స్పెషల్ ఎడ్యుకేషన్‌ లో ఉత్తీర్ణత. లేదా డిగ్రీ మరియు రెండేళ్ల బీఈడీఉత్తీర్ణత (6 నెలల ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ లో బ్రిడ్జి-కోర్సు పూర్తి చేయాలి) మరియు టీచర్ ఎలిజిబిలిటీటెస్టులో అర్హత తప్పనిసరి.

ఎలిమెంటరీ/అప్పర్‌ ప్రైమరీ:

డిగ్రీ మరియు రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ లోఉత్తీర్ణత తప్పనిసరి. లేదా 50 శాతం మార్కులతోడిగ్రీ మరియు రెండేళ్ల బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి.లేదా 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమానం మరియు నాలుగేళ్ల బ్యాచిలర్‌‌‌‌ ఆఫ్ ఎలిమెంటరీఎడ్యుకేషన్‌ లో ఉత్తీర్ణత. లేదా 50 శాతం మార్కుల-తో డిగ్రీ మరియు స్పెషల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌ లో వన్‌ ఇయర్‌‌‌‌ బీఈడీ తప్పనిసరి. మరియు టీచర్ ఎలిజిబులిటీటెస్టులో అర్హత ఉండాలి.

సెకండరీ (9 – 10 తరగతులు):

కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ / పీజీ ఉత్తీర్ణతమరియు రెండేళ్ల బీఈడీ ఉత్తీర్ణత. లేదా నాలుగేళ్లబీఏ బీఈడీ లేదా బీఎస్సీ బీఈడీ ఉత్తీర్ణత. టీచర్‌‌‌‌ ఎలిజిబిబిలిటీ టెస్టు ఉండాలి.

సీనియర్‌ సెకండరీ:

కనీసం 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత నాలుగేళ్ల బీఏ ఈడీ / బీఎస్సీ ఈడీ లో ఉత్తీర్ణత సాధించాలి.అలాగే టీచర్ ఎలిజిబిలిటీ టెస్టులో అర్హత ఉండాలి.

ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌ అర్హతలు…..

ప్రైమరీ/అప్పర్‌ ప్రైమరీ (1 నుంచి 8వ తరగతివరకు): కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌‌‌‌ / ఇంటర్‌‌‌‌ ఉత్తీర్ణతతో స్కూల్‌‌‌‌/కాలేజ్‌ /డిస్ట్రిక్‌ లెవెల్‌‌‌‌లో క్రీడలు/ ఆటల్లో పాల్గొని ఉండాలి. మరియు ఎన్‌ సీటీఈగుర్తింపు పొందిన సంస్థ నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్నుంచి రెండేళ్ల డిప్లొమా/సర్టిఫికెట్‌ కోర్సులో ఉత్తీర్ణత తప్పనిసరి.

సెకండరీ (9 -10 తరగతులకు:

నీసం 50 శాతం మార్కులతో ఫిజికల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌ఎలెక్టివ్‌ గా డిగ్రీ ఉత్తీర్ణత. లేదా 45 శాతం మార్కు-లతో ఫిజికల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌ ఎలెక్టివ్‌గా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు జాతీయ, రాష్ట్ర మరియు అంతరాష్ట్రస్థాయిలో క్రీడలు/ఆటల్లో పాల్గొని ఉండాలి. లేదాకనీసం 40 శాతం మార్కులతో ఫిజికల్‌‌‌‌ ఎడ్యుకేషన్లోడిగ్రీ / మూడేళ్ల బ్యాచిలర్‌‌‌‌ ఆఫ్‌ ఫిజికల్‌‌‌‌ ఎడ్యుకేషన్లో డిగ్రీ ఉత్తీర్ణత.

సీనియర్‌ సెకండరీ (ఇంటర్‌ ):

కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్ ఆఫ్‌ఫిజికల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌ (బీఈపీడీ) లేదా బ్యాచిలర్ ఆఫ్‌ఫిజికల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌ (బీపీఈ) కోర్సులో ఉత్తీర్ణతలేదా హెల్త్‌‌‌‌ అండ్ ఫిజికల్‌‌‌‌ ఎడ్యుకేషన్లో బీఎస్సీ /55 శాతం మార్కులతో స్పోర్స్‌ట్ లో డిగ్రీ పాసవ్వాలి.లేదా 50 శాతం మార్కులతో బ్యాచిలర్ ఆఫ్‌ ఫిజికల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌ (బీఈపీడీ) లేదా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌‌‌‌ బ్యాచిలర్ ఆఫ్‌ ఫిజికల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌ (బీఈపీడీ) డిగ్రీఉత్తీర్ణత. మరియు రెండేళ్ల మాస్టర్‌‌‌‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(ఎంపీఈడీ) లో ఉత్తీర్ణత తప్పనిసరి.

ఎన్‌‌‌‌సీటీఈ……

ఎన్‌ సీటీఈ 2018 జూన్‌ 28న బీఈడీ చేసినవారికికూడా 1 నుంచి ఐదవ తరగతి వరకు బోధించడా-నికి అవకాశం కల్పించింది. అయితే ఉపాధ్యాయు-లుగా ఎంపికయిన వారు రెండు సంవత్సరాల లోపుఎన్‌ సీటీఈ గుర్తించిన సంస్థల నుంచి ఎలిమెంటరీఎడ్యుకేషన్‌ లో 6 నెలల బ్రిడ్జ్ కోర్సు ను తప్పనిసరిగాపూర్తి చేయాలి.

ఎన్‌‌‌‌సీఈఆర్‌ టీ….

పాఠశాల విద్యలో గుణాత్మక మార్పును తీసుకు-రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు,సూచనలు ఇవ్వడానికి 1961 లో నేషనల్ కౌన్సిల్‌‌‌‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌‌‌‌ అండ్‌‌‌‌ ట్రైనింగ్‌ ను ఏర్పాటుచేశారు. పాఠశాల విద్యకు సంబంధంచి కాలానుగుణంగా పరిశోధనలు చేయడం, పాఠ్యపుస్తకాలు ప్రచురించడం, విద్యా కిట్స్ మల్టీ మీడియా మెటీరియల్స్‌‌‌‌ను రూపొందిం చడం, టీచర్లకు సర్వీస్‌‌‌‌ ట్రైనిం గ్‌ ను అందిం చడం, ఉపాధ్యాయ విద్యలోసృజనాత్మకతను పెంపొందించడం ఎన్‌ సీఈఆర్‌‌‌‌టీ విధి. దీనిక సంబంధించి రాష్ట్రా ల్లో స్టేట్‌ కౌన్సిల్‌‌‌‌ ఆఫ్‌ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌‌‌‌ అండ్‌‌‌‌ ట్రైనింగ్‌ అనేది నోడల్ఏజెన్సీగా ఉంటుంది. ఇది రాష్ట్రా ల్లో ఎన్‌ సీఈఆర్‌‌‌‌టీసిఫార్సులు అమలు చేస్తుంది.

బీఈడీకి ప్రత్యేకం ఆర్‌ ఐఈ…

సాంప్రదాయ బీఈడీ కాలేజీలకు భిన్నంగా రీజనల్ఇన్‌ స్టి ట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో బీఈడీ కోర్సులుఅభ్యసించవచ్చు. ఆర్‌‌‌‌ఐఈలో బీఈడీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు ఎన్‌ సీఈఆర్‌‌‌‌టీ కామన్ ఎంట్రన్స్ఎగ్జామినేషన్ (సీఈఈ) నిర్వహిస్తుంది. దీని ద్వారాబీఈడీ, ఎంఈడీ, బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈడీ వంటి కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తా రు. బీఎస్సీ బీఈడీ అండ్ బీఏ బీఈడీ ( నాలుగేళ్లు)కి సైన్స్ వారు ఫిజిక్స్, కెమిస్ర్టీ మ్యాథ్స్, బయాలజీకాంబినేషన్‌ తో కనీసం 50 శాతం మార్కులతో10+2/ సీనియర్ సెకండరీ/హయ్యర్ సెకండరీలేదా తత్సమానం, బీఏ బీఈడీ కి సైన్స్/కామర్స్/ఆర్స్ట్ విభాగంలో 10+2/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఎంఎస్సీ ఎడ్యుకేషన్ కు సైన్స్/మ్యాథమెటిక్స్విభాగంలో 10+2/ తత్సమానం, బీఈడీ కి ఏదైనాడిగ్రీ, ఎంఈడీ కి బీఈడీ పాసవ్వాలి. ఇంటిగ్రేటెడ్బీఈడీఎంఈడీ ఏదైనా పీజీ ఉత్తీర్ణత సాధించాలి.వెబ్ సైట్​: www.cee.ncert.gov.in