
పర్వతగిరి (గీసుగొండ), వెలుగు: స్టూడెంట్లకు నాణ్యమైన విద్యతోపాటు, పౌష్టికాహారం అందించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరి కస్తూర్బా గాంధీ బాలికల స్కూల్నుగురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన హాస్టల్ పరిసరాలు, డైనింగ్ హాల్, వంటగది, స్టోర్ రూమ్, డిజిటల్ క్లాస్ రూంలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని టీచర్లు, సిబ్బందికి సూచించారు.