సింగరేణిలో నాణ్యమైన ఎక్స్‌‌ప్లోజివ్స్ వాడాలి

గోదావరిఖని, వెలుగు :  సింగరేణి సంస్థలో నాణ్యమైన ఎక్స్‌‌ప్లోజివ్స్ వినియోగించి నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి  చేయాలని సంస్థ డైరెక్టర్లు ఎన్‌‌వికె శ్రీనివాస్‌‌, జి.వెంకటేశ్వర్‌‌ రెడ్డి సూచించారు. మంగళవారం గోదావరిఖనిలోని సింగరేణి ఇల్లందు క్లబ్‌‌లో 'డ్రిల్లింగ్‌‌, బ్లాస్టింగ్‌‌' అంశంపై అవగాహన, సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా హాజరైన డైరెక్టర్లు మాట్లాడుతూ సింగరేణి ఓపెన్‌‌ కాస్ట్‌‌ ప్రాజెక్ట్‌‌లలో బొగ్గు పొరలపై ఉన్న మట్టిని తొలగించేందుకు చేసే బ్లాస్టింగ్‌‌ ఖర్చు తగ్గించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.  కార్పొరేట్‌‌ ఆర్‌‌అండ్‌‌డి జనరల్‌‌ మేనేజర్‌‌ ఎండి సుభానీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామగుండం రీజియన్‌‌ జీఎంలు చింతల శ్రీనివాస్‌‌, ఎల్‌‌వి సూర్యనారాయణ, సుధాకర్‌‌ రావు,  పాల్గొన్నారు.