- కూలుతున్న డివైడర్లు .. గుంతలు పడుతున్న రోడ్లు
- సీఎం స్పెషల్ఫండ్స్తో చేపట్టిన వర్క్స్ అస్తవ్యస్తంగా
కామారెడ్డి, వెలుగు: ఆఫీసర్ల పర్యవేక్షణ లోపంతో సీఎం స్పెషల్ఫండ్స్తో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించింది. దీంతో పనులు పూర్తయి, ప్రారంభానికి నోచుకోకముందే మళ్లీ రిపేర్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని టెక్రియాల్చౌరస్తా నుంచి జిల్లా కేంద్రం మీదుగా నర్సన్నపల్లి వైపు హైవే వరకు డివైడర్నిర్మించి, సెంట్రల్ లైటింగ్ఏర్పాటు చేశారు. ఈ పనులు జరిగి ఏడాది అవుతోంది. ఇంకా ప్రారంభించకముందే డివైడర్ కూలిపోయిది. పలు చోట్ల పగుళ్లు వచ్చాయి. నిజాంసాగర్‌చౌరస్తా నుంచి దేవునిపల్లి శివారు వరకు నిర్మించిన డివైడర్కూడా మధ్యలో రాళ్లు పడిపోయాయి. హౌజింగ్‌బోర్డు కాలనీ నుంచి నర్సన్నపల్లి వరకు కొద్దిరోజుల క్రితమే చేపట్టిన బీటీ రోడ్డు మీద పలు చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. పనులు కంప్లీటై ఏడాది కాకుండానే రోడ్డు అధ్వాన్నంగా మారడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం స్పెషల్ఫండ్స్తో పనులు
2021, జూన్‌లో కలెక్టరేట్ బిల్డింగ్ప్రారంభానికి వచ్చిన సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో సౌలత్లు కల్పించేందుకు రూ.50 కోట్ల స్పెషల్ఫండ్స్ప్రకటించారు. కొన్నాళ్లకు ఫండ్స్రిలీజయ్యాయి. ఈ ఫండ్స్‌తో టౌన్లో మెయిన్‌రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, కాలనీల్లో సీసీ రోడ్ల పనులు చేపట్టారు. ప్రధానంగా మెయిన్‌రోడ్ల వెడల్పు, డివైడర్, సెంట్రల్ లైటింగ్వర్క్స్కు ప్రయార్టీ ఇచ్చారు. వీటికి రూ.30 కోట్లు కేటాయించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టెక్రియాల్చౌరస్తా నుంచి నర్సన్నపల్లి చౌరస్తా వరకు 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి, నిజాంసాగర్‌చౌరస్తా నుంచి దేవునిపల్లి శివారు వరకు రోడ్డు వెడల్పు,సెంట్రల్‌లైటింగ్, సిరిసిల్ల రోడ్డులో డివైడర్, సెంట్రల్లైటింగ్పనులు చేశారు. నర్సన్నపల్లి నుంచి హౌజింగ్‌బోర్డు వరకు ప్రస్తుతం 6 లైన్ల రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. పలు వార్డుల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణ పనులు కూడా జరిగాయి. ఆర్అండ్బీ, మున్సిపల్, పంచాయతీ రాజ్‌శాఖల అధికారులు పనులను పర్యవేక్షించారు.
పనుల్లో లోపాలు..
జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ ఆఫీస్నుంచి నర్సన్నపల్లి వరకు 4 లైన్ల రోడ్డు వేసిన ఏడాదిలోనే గుంతలు పడ్డాయి. హౌజింగ్‌బోర్డు కాలనీ, నర్సన్నపల్లి చౌరస్తా సమీపంలోని బిడ్జిల మధ్య కొత్తగా వేసిన రోడ్డు కుంగిపోయింది. బ్రిడ్జికి, రోడ్డుకు జాయింట్వద్ద పగుళ్లు ఏర్పడ్డాయి. బైక్స్, ఫోర్వీలర్స్కుంగిపోయిన ఏరియాకు రాగానే పైకి ఎగురుతున్నాయి. కొత్త వ్యక్తులు వెహికిల్స్‌పై నుంచి కింద పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. అశోక్నగర్కాలనీ, పాత బస్టాండ్, దేవునిపల్లి తదితర ఏరియాల్లో సిమెంట్కొట్టుకుపోయింది.
మళ్లీ రిపేర్చేయిస్తాం
టెక్రియాల్నుంచి నర్సన్నపల్లి వరకు చేపట్టిన 4 లైన్ల రోడ్డు నిర్మాణం ఏడాదిన్నర కింద కంప్లీటైంది. వర్క్స్క్వాలిటీగానే చేయించాం. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాం. కొన్ని చోట్ల బీటీ పోయి గుంతలు ఏర్పడ్డాయి. గుంతలు పడిన చోట, బ్రిడ్జిల వద్ద కుంగిన చోట మళ్లీ రిపేర్చేయిస్తాం.
- శ్రీనివాస్, ఆర్అండ్బీ ఈఈ, కామారెడ్డి